Tuesday, April 16, 2024
- Advertisement -

సాక్షి మీడియాకు దిమ్మతిరిగే స్థాయిలో దెబ్బకొట్టిన పచ్చ బ్యాచ్

- Advertisement -

జగన్ అవినీతి వ్యవహారాలు, ఆస్తుల స్వాధీనం అంటూ ప్రపంచానికి పాఠాలు చెప్పాను అనే పాలకుడు తరచుగా చెప్తూ ఉంటాడు కానీ ….ఆ బ్యాచ్ అసలు వ్యూహం మాత్రం సాక్షి మీడియాను దెబ్బకొట్టడమే. మీడియా అబద్ధపు ప్రచారాలతో ఎన్టీఆర్‌లాంటి మహా నటుడు, గొప్ప నాయకుడిని తెలుగువారికి దూరం చేసిన ఆ బ్యాచ్‌కి మీడియా పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అందుకే మీడియా అంటే వాళ్ళకు అంత భయం. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షిని మినిహాయిస్తే మిగతావన్నీ కూడా కేవలం భజన మీడియా సంస్థలే అన్నది ముమ్మాటికీ నిజం. అందుకే ఆ సాక్షి ఒక్కటీ లేకుండా పోతే …….ఇక ఆ తర్వాత నుంచీ తాము ఆడింది ఆట పాడింది పాట అన్నది పచ్చ బ్యాచ్ వ్యూహం. ప్రస్తుతం ఓట్లేసి గెలిపించిన ప్రజలనే తిడుతున్న ముఖ్యనాయకుడు…… సాక్షి మూతపడ్డాక ఆ ప్రజలను తన బావమరిది స్టైల్‌లోనే చెంపదెబ్బలు కొట్టినా కూడా…..వాటిని ప్రేమదెబ్బలుగా ప్రచారం చేస్తూ ఇతరులను నమ్మించగల స్థాయి సమర్థత భజన మీడియాకు ఉందాయే. అందుకే సాక్షి మీడియాను లేకుండా చేయాలని చెప్పి ఎన్నో కుట్రలు చేస్తూ ఉంటుంది పచ్చ గ్యాంగ్.

మూడున్నరేళ్ళుగా పచ్చ బ్యాచ్ పన్నిన వ్యూహాలన్నీ కూడా సక్సెస్ అయినట్టుగా తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సాక్షి ఛానల్‌ని ఎలాగూ కొన్ని ప్రాంతాల్లో రాకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలు…….ఇప్పుడు సాక్షి పేపర్‌ని పూర్తి స్థాయిలో దెబ్బకొట్టే వ్యూహాంలో కొంత వరకూ సక్సెస్ అయ్యారు. తాజాగా సాక్షి పత్రిక నుంచీ నలుగురు అగ్రస్థాయి ఉద్యోగులు పచ్చ బ్యాచ్ ప్రధాన మీడియా సంస్థలోకి జంప్ అయినట్టుగా తెలుస్తోంది. వెళుతూ వెళుతూ మరో నలభైమంది ఉద్యోగులను తమతో పాటు తీసుకుపోయారట. పచ్చ బ్యాచ్ తోక పత్రిక అయితే సాక్షి నుంచి ఎంతమంది వచ్చినా రెట్టింపు జీతాలతో తీసుకుంటామని ఘనంగా చెప్పుకుంటోంది. మూడున్నరేళ్ళలో సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలు, ఎంపిలనే కొంటున్నప్పుడు……ఆఫ్టర్ ఆల్ మీడియా ఉద్యోగులను కొనడం ఎంత అని చెప్పి రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నప్పటికీ ఎల్లో గ్యాంగ్ మాత్రం నిస్సిగ్గుగా తమను తాము సమర్థించుకుంటోంది. మరో నలభై మందిని కూడా సాక్షి నుంచి తీసేసుకునే ప్రయత్నాల్లో ఆ తోక పత్రిక ఉంది. నలుగురు అగ్రస్థాయి ఉద్యోగులు, దాదాపుగా ఎనభై మంది ఉద్యోగులు సాక్షి నుంచి వెళ్ళడం ఖాయం అయిన నేపథ్యంలో ఇది సాక్షికి చాలా పెద్ద దెబ్బ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ స్థాయి దెబ్బను సాక్షి పెద్దలు ఊహించారా? ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ముందు ముందు సాక్షి పయనం ఎలా ఉండబోతోంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -