Tuesday, April 16, 2024
- Advertisement -

ప‌విత్ర దీవికి యునెస్కో గుర్తింపు..

- Advertisement -

ప్ర‌పంచంలో కొన్ని దేవాల‌యాల్లోకి మ‌హిళ‌ల ప్ర‌వేశానికి అనుమ‌తిలేదు. కాని మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం క‌ల్పించాల‌ని కోర్టుకు వెల్ల‌డం ….కోర్టులు తీర్పు అనుకూలంగా ఇవ్వ‌డం చూస్తున్నాం.కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల‌య ఆలయంలోకి మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం లేద‌న్న సంగ‌తి తెలిసిందే… అలాంటి ఆచారాలు ఉన్న దీవి కూడా ఉంది.ఆ దీవిలోకి మ‌హిళ‌లు వెల్ల‌డాన్ని నిషేధించారు. ఆ దీవి గురించి తెలుసుకుందాం.

జ‌పాన్‌కు నైరుతి దిశ‌లో ఉన్న ఓ ప‌విత్ర దీవికి అంత‌ర్జాతీయ విద్యా, సాంకేతిక‌, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు ల‌భించింది. ఒకినోషిమా అని పిలిచే ఈ దీవిలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశం నిషిద్ధం. పురుషులు కూడా ప్ర‌వేశించ‌డానికి ముందు దిగంబ‌రులై స‌ముద్రంలో స్నానం చేసి పాపప్ర‌క్షాళ‌న చేసుకోవాలి.

700 చ‌ద‌ర‌పు మీ. వైశాల్యం ఉన్న ఈ దీవి లోప‌లికి ప్ర‌తి ఏడాది మే 27న కేవ‌లం 200 మంది పురుషుల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం క‌ల్పిస్తారు. వీరంతా క‌లిసి 1904-05 మ‌ధ్య కాలంలో ర‌ష్యా-జ‌పాన్ యుద్ధంలో అసువులు భాసిన సైనికుల‌కు నివాళులు అర్పిస్తారు. అలాగ‌ని వారు ఇక్క‌డి చిన్న గ‌డ్డి పోచ‌ను కూడా తీసుకెళ్ల‌డానికి వీలు లేదు.

స‌హ‌జంగా వ‌చ్చే రుతుస్రావం వ‌ల్ల మ‌హిళ‌లు అప‌విత్రుల‌ని ఈ దీవిలోకి వారి ప్ర‌వేశాన్ని నిషేధించ‌న‌ట్లు ఒక వాద‌న‌. ఈ ప్రాంతంలో వై వంశీయులు ఉప‌యోగించిన బంగారు వ‌స్తువులు, సామాగ్రితో క‌లిపి 80,000 వ‌ర‌కు పురాత‌న క‌ళాఖండాలు ఉన్నాయ‌ని, యునెస్కో గుర్తింపు ల‌భించినంత మాత్రాన ఈ ప‌విత్ర స్థ‌లాన్ని సంద‌ర్శ‌న స్థ‌లంగా మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని ఆ దీవిలో పూజ‌లు నిర్వ‌హించే ముఖ్య పూజారి త‌క‌యుకి అషిజు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -