యశోద లో డెడ్ బాడీ కి ట్రీట్మెంట్ చేస్తూ దొరికిపోయారా.?

863
yashoda hospital dead body treatment
yashoda hospital dead body treatment

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా లో ఓ సీన్ ఇప్పటికీ అందరికి కళ్ళముందు కదలాడుతూనే ఉంటుంది.. అదే డెడ్ బాడీ కి ట్రీట్మెంట్ చేసే సీన్.. ఒక డెడ్ బాడీ ని తెచ్చి కాపాడాలంటూ చిరంజీవి హాస్పిటల్ యాజమాన్యం ని నమ్మించి వారి కుట్ర ను బయటకు తెలియపరచి హాస్పిటల్ ని మూయించాడు.. అయితే ఇది సినిమా వరకైతే పర్వాలేదు.. కానీ నిజజీవితంలో కూడా జరిగింది..

య‌శోద ఆస్ప‌త్రిలో చ‌నిపోయిన మ‌హిళ‌కు ట్రీట్‌మెంట్ చేసి.. రూ. 29 ల‌క్ష‌ల వ‌సూలు చేశార‌న్న ఫిర్యాదుపై హైదరాబాద్​ డీఎంహెచ్​వో విచార‌ణ‌కు ఆదేశించింది. ఇద్దరు సీనియర్​ డాక్టర్లతో కమిటీ వేసింది. మలక్​పేట UHNC హెల్త్​ ఆఫీసర్​ డాక్టర్​ విజయ లక్ష్మి.. అల‌గే శాలివాహన నగర్​​ UPHC మెడికల్​​ఆఫీసర్​​ డాక్టర్​ వీణను విచార‌ణ‌ కమిటీ సభ్యులుగా నియ‌మించింది. మూడు రోజుల్లో స‌మ‌గ్ర నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.

మహబూబ్​నగర్​ జిల్లా బల్సూరుగొండకు చెందిన ACTO శ్వేతారెడ్డి గ‌త నెల‌ డెలివ‌రీ కోసం యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆస్ప‌త్రి మేనేజ్‌మెంట్ ముందుగా 2 లక్షల రూపాయ‌లు డిపాజిట్​​ చేయించుకుంది. ఆ త‌ర్వాత ప‌లు ద‌ఫాలుగా రూ.29 లక్షల వ‌ర‌కు క‌ట్టించుకొని.. చివ‌రికి ఆమె చనిపోయారంటూ కుటుంబ సభ్యులకు స‌మాచారం అందించింది. శ్వేతారెడ్డి చ‌నిపోయినా చెప్ప‌కుండా ఆస్ప‌త్రి యాజ‌మాన్యం మోసం చేసి.. డ‌బ్బులు వ‌సూలు చేసిందంటూ కుటుంబ స‌భ్యులు ఆరోపించారు ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ క్ర‌మంలో ఆలిండియా యాంటీ కరప్షన్​ కమిటీ తెలంగాణ అధ్యక్షుడు ముజాహిద్​ మోయిద్దీన్​​ఖాద్రీ హైదరాబాద్​ డీఎంహెచ్​వోకు ఫిర్యాదు చేశారు.దాని ఆధారంగా విచార‌ణ‌కు ఆదేశించింది.

Loading...