Friday, April 26, 2024
- Advertisement -

జ‌గ‌న్ ప్రజాసంకల్ప యాత్ర @ 3000

- Advertisement -

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు ఆయన ఈ పాదయాత్రకు శ్రీకారంచుట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులు 3 వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూసి.. సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకుంటారు.

పాద‌యాత్ర మొద‌లు పెట్టిన‌ప్ప‌టినుంచి ఇప్పుటి వ‌ర‌కు మ‌హాసంక‌ల్పంలా సాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమవుతూ.. నేనున్నానని భరోసా ఇస్తూ.. ముందుకుసాగుతున్న జననేత పాదయాత్ర మరో మైలురాయిని దాటబోతోంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఈ నెల 24వ తేదీన విజయనగరం జిల్లా కొత్తవలస దగ్గరలోని దేశపాత్రునిపాలెం వద్ద 3000కిలోమీటర్ల మైలురాయిని చేరనుంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా పుర్తిచేసుకుని విజయనగరం జిల్లాలోకి ప్ర‌వేశించ‌నుంది. ఈ సందర్భంగా అక్కడ ఓ భారీ బహిరంగ సభ నిర్వహించి.. ఫైలాన్‌ను ఆవిష్కరించబోతున్నారు.

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా బ్ర‌హ‌ర‌థంప‌డుతూ వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుంటున్నారు. ప్ర‌జ‌ల బాధ‌లు, క‌ష్టాల‌ను జ‌గ‌న్మోహ‌నుడు సావ‌ధానంగా వింటూ వారికి భ‌రోసా నిస్తూ ముందుకు సాగుతున్నారు. ప‌లు బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక పాల‌న‌ను ఎండ‌గ‌డుతూ అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి మంచి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తామో చెప్తు ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తున్నారు.

ఇక పార్టీ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. పాద‌యాత్ర‌లోనే కొన్ని చోట్లు అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టిస్తూ అధికార పార్టీకీ షాక్ ఇస్తున్నారు. ఇక వ‌ల‌స‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అధికార‌పార్టీ టీడీపీనీ కాద‌ని ముఖ్య‌మైన నాయ‌కులు పార్టీ కండువా క‌ప్ప‌కుంటున్నారు.

జననేత పాదయాత్ర ఇప్పటివరకు.. 116 నియోజకవర్గాల్లోని 193 మండలాల్లో.. 1650 గ్రామాల మీదుగా సాగిందని, అదేవిధంగా 44 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్ల పరిధిలో పాదయాత్ర జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు పాదయాత్రలో భాగంగా 106 సభలు, 41 ఇంట్రాక్షన్లు జరిగాయని వివరించారు. 269వ రోజు పాదయాత్ర దేశపాత్రునిపాలెంలోకి ప్రవేశిస్తుందని, అక్కడ 107వ బహిరంగ సభ జరగనుందని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -