Thursday, April 25, 2024
- Advertisement -

కేసీఆర్ ఆహ్వానాన్ని జగన్ తిరస్కరిస్తారా.?

- Advertisement -

రాజకీయంగా లాభపడడం వేరు… రాజకీయాల్లో స్నేహం వేరు.. అయితే ఏపీకి నష్టం చేకూరే ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ ఎగువరాష్ట్రం.. ఏపీ దిగువ రాష్ట్రం.. దీంతో తెలంగాణను దాటి కృష్ణా, గోదావరిలు ఏపీకి రావాలి. మరి తెలంగాణ ప్రాజెక్టులు కడితే ఏపీకి చుక్క నీరు రాదు. అలాంటి భారీ ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు ఓపెనింగ్ కు కేసీఆర్ ఏకంగా కింది రాష్ట్రం జగన్ ను ఆహ్వానిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు వెళితే రాజకీయంగా నష్టం జరుగుతుందని.. ఈ ఓపెనింగ్ కు వెళ్లకపోవడమే మంచిదన్న అభిప్రాయం ప్రస్తుతం ఏపీలోని వైసీపీ అధిష్టానంలో సాగుతుందట..

తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీటి కరువు అనేది తెలంగాణకు తీరుతుంది. అయితే గోదావరి జలాలను ఏపీకి దక్కకుండా తెలంగాణ లాగేసుకుంటుండడంపై గడిచిన సీఎం చంద్రబాబు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సుప్రీం కోర్టుకెళ్లాడు. కేంద్రంలో పంచాయతీ పెట్టాడు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. కేసీఆర్ తో దోస్తీ కడుతూ మంచి సంబంధాలు నెలకొల్పాడు. దీంతో ఇప్పుడు ఈ దోస్తీ ముఖ్యమా.? లేక చంద్రబాబు ఆయుధాన్ని ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లడం ముఖ్యమా అన్న సందిగ్ధంలో జగన్ ఉన్నట్టు తెలిసింది..

కాళేశ్వరం ప్రాజెక్టుకు జగన్ వెళితే.. ఏపీకి నీళ్లు దక్కని ప్రాజెక్టు కు వెళతావా అని చంద్రబాబు యాగీ చేసే అవకాశం ఉంది. అదే వెళ్లకపోతే సాయం చేసిన కేసీఆర్ ను అవమానించినట్టు అవుతుంది. ఇప్పుడు సీఎం జగన్ ఏం చేస్తాడన్నది ఆసక్తిగా మారింది.?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -