Wednesday, April 24, 2024
- Advertisement -

అసెంబ్లీ, అఖిలపక్ష సమావేశం…. జగన్ చేస్తోంది కరెక్టేనా?

- Advertisement -

నాలుగున్నరేళ్ళ కాలంలో పట్టుమని పది రోజులు కూడా ప్రజల మధ్య లేని పవన్ కళ్యాణ్‌లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు? అఖిలపక్ష సమావేశానికి ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తున్నారు? ఇక చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ జనాల నంగనాచి మాటలకు అంతే లేదు. మరి వీళ్ళ మాటలు అన్నీ కరెక్టేనా? నిజంగా జగన్ చేస్తోంది తప్పేనా? చంద్రబాబు చేస్తున్నది రైటా? పచ్చ మీడియా అంతా ప్రచారం చేస్తున్నట్టుగా జగన్‌కి ప్రజా సమస్యలు పట్టడం లేదా? కాస్త కామన్‌సెన్స్ ఉన్న ఎవరికైనా ఈ ప్రశ్నలకు ఇట్టే సమాధానం దొరుకుతుంది. కానీ ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా సీమాంధ్రులకు లేదు అన్నది బాబు అండ్ బ్యాచ్ ప్రగాఢ నమ్మకం.

ప్రత్యేక హోదా విషయంలో ఎ1 నరేంద్రమోడీ అని చెప్పడానికి ఎవరికీ ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. ఇక చట్టంలో పెట్టని కాంగ్రెస్‌ది కూడా పాపం. ఆ పాపానికి 2014 ఎన్నికల్లో ఫలితం అనుభవించింది. ఇంకా అనుభవిస్తూ ఉంది. మరి ఈ విషయంలో ఎ2 ఎవరు? నిస్సందేహంగా చంద్రబాబే. కాదని పచ్చ మీడియా చెప్పలేదు. 2014 ఎన్నికల సమయంలో పదిహేనేళ్ళు ప్రత్యేక హోదా కావాలి. మోడీని గెలిపిస్తే మోడీతో కలిసి నేను ప్రత్యేక హోదా తెస్తా అన్నది బాబు. ఆ తర్వాత హోదా వేస్ట్ అని చెప్పి నాలుగేళ్ళపాటు ప్రజలను వంచించింది బాబు. హోదా వేస్ట్ అని చెప్పి ఇదే బాబు భజన పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడులు కూడా ఏ స్థాయిలో ప్రచారం చేశాయో చెప్పనవసరంలేదు. వాళ్ళకు భజన చేసే మేధావులు అనే ముసుగు వేసుకున్నవాళ్ళ చేత కూడా హోదాకు వ్యతిరేకంగా మాట్లాడించాయి. నాలుగున్నరేళ్ళపాటు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేసింది, పోరాడింది వైఎస్ జగన్ అని చెప్పి తెలియనివారు ఎవరైనా ఉన్నారా?

ఇక ఇప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ పచ్చ బ్యాచ్ అందరూ కొత్త డ్రామాకు తెరలేపారు. అది కూడా చివరి పార్లమెంట్ సమావేశాలు అయ్యాక ఢిల్లీలో ధర్నా చేస్తారట. ఎందుకు ? చివరి పార్లమెంట్ సమావేశాలు అయ్యాక ధర్నా చేస్తే వచ్చేది ఏంటి? అలాంటి మోసపూరిత ధర్నాకు క్రేజ్ తీసుకురావడానికి ఇప్పుడు అఖిల పక్ష భేటీ డ్రామాకు తెరలేపారు. నిజాయితీగా రాజకీయాలు చేస్తాను అని చెప్తూ, ఆ బాటనే నడుస్తూ ఉన్న జగన్ ఈ మోసపూరిత రాజకీయాలు జై కొట్టాలా? నాలుగేళ్ళు మోడీకి ఊడిగం చేసి హోదాతో సహా సీమాంధ్రకు రావాల్సిన అన్ని ప్రయోజనాలనూ తుంగలో తుక్కి ఇప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను ప్రజలు హర్షించాలా? జగన్ జై కొట్టాలా?

ఇక కోడెల శివప్రసాద్ స్పీకర్‌గా ఎలా వ్యవహరిస్తున్నారో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించిన కోడెలకు వైకాపా నుంచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల రాజీనామాలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న విషయం తెలియదా? ఫిరాయింపు ఎమ్మెల్యేలను, వైకాపా ఎమ్మెల్యేలుగానే ఉన్నవాళ్ళకు టిడిపి తరపున మంత్రులను చేయడం కంటే దారుణం వేరే ఉంటుందా? అలాంటి అన్యాయాలు చోటు చేసుకుంటున్న అసెంబ్లీకి విలువ ఉందా? విలువల్లేని అలాంటి రాజకీయాలు చేయలేను అని జగన్ చెప్తే అది తప్పవుతుందా? కళ్ళకు కనిపించే నిజాలను కాస్త విశ్లేషించుకోగలిగితే చాలు…………..ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు రాజకీయాలు, పచ్చ బ్యాచ్ అబద్ధపు డ్రామాలు, ప్రచారాలు ఇట్టే అర్థమయిపోతాయి అని రాజకీయవేత్తలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితులు ఎంతలా దిగజారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -