Friday, March 29, 2024
- Advertisement -

కంటతడి పెట్టిస్తున్న జగన్ అభిమాని ఆవేదన….. ఇది కదా జగన్ సంపాదించిన ఆస్తి

- Advertisement -

సోనియా చెప్పినట్టు విని ఉంటే జగన్ సిఎం అయ్యేవాడు….. బాబు చెప్పుకున్నట్టుగా ఇన్నేళ్ళు ఈ పదవిలో ఉన్న రికార్డ్ అంటూ చెప్పుకునే అవకాశం ఉండేదేమో. కానీ కోట్ల మంది ఉన్న ఇలాంటి అభిమానులు మాత్రం జగన్‌కి ఉండేవారు కాదు. దేశంలోనే ఏ నాయకుడికీ లేనంతగా ఈ స్థాయి అభిమానులు జగన్‌కి ఉండేవారు కాదు. ఎసి కూలింగ్‌లో టెంట్ల కింద చంద్రబాబు ప్రచారం చేస్తుంటే జనాలు రావడం లేదు. కానీ జగన్‌కి వైఎస్ కుటుంబానికి మాత్రం మండుటెండను కూడా లెక్క చేయకుండా లక్షలమంది వస్తున్నారు. ఆ స్థాయిలో జగన్‌పై అభిమానం ఉండడానికి కారణం ఏంటి? వైఎస్‌లపై దేశంలోనే ఏ నాయకులకూ లేనంత అభిమానం చూపించడానికి కారణం ఏంటి? ఒక అభిమాని రాసిన ఈ లేఖ చూడండి. మీకే అర్థమవుతుంది.

నీకు అవసరమా జగన్ ఈ రాజకీయాలు???

నీతాతను బాంబులేసి, కత్తులతో నరికారు, అయినా జనమే కావాలి,,
నీనాయన్ను కుట్ర చేసి,హెలికాప్టర్ ద్వారా చంపారు, అయినా జనమే కావాలి,
నీపై ఎయిర్ పోర్టులో ,కత్తితో మెడకోసి చంపాలని చూసారు, అయినా జనమే కావాలి,
చివరికి నీచిన్నాయనను ఇంట్లోకే వచ్చి చంపిపోయారు, అయినా జనమే కావాలి,
నీకెందుకయ్యా ఈరాష్టంపై ఇంత ప్రేమ? ఎవడు ఎట్ట పోతే నీకెందుకు? నీకేం తక్కువ? తిండికి లేదా?గుడ్డకు లేదా? అన్ని ఉన్నా జనమే కావాలి.
కోరుకుంటే నిల్చున్న చోటనుండి కదలకుండా, వ్యాపారాలు చేసుకుంటూ దర్జాగా బతికగలుగుతావు, అయినా జనమే కావాలి,
పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ తో పుట్టిన పుట్టుకనీది, నువ్వు కావాలంటే ఏ ఫారిన్ దేశంలోనో, సూటు బూటు వేసుకుని,వ్యాపారాలు చేసుకుంటూ, పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే రాయల్ ప్యామిలీ నీది, అయినా జనమే కావాలి,
ఆరోజు సోనియాగాంధీ చెప్పినట్లు విని, ప్రజలు ఏమైపోతే నాకేం అనుకుని, సెంట్రల్ మినిస్టర్ పధవి తీసుకుని అందరి మాదిరే నువ్వు స్వార్థ రాజకీయాలు ఎందుకు చేయలేదు? అయినా జనమే కావాలి,
కాదని జనం కోసం పార్టీ పెట్టావ్, తప్పుడు కేసుల్లో అన్యాయంగా జైలుకు పోయావ్, అప్పటికైనా బుద్ధిరావాలిగా? అయినా జనమే కావాలి,
ఎవడికి పుట్టారో తెలీని,ఎంతమంది తండ్రులో లెక్కలేని నీచపునాకొడుకులతో అడ్డమైన మాటలు పడుతున్నావ్, అయినా జనమే కావాలి,
మాగురించి నీకెందుకయ్యా? మాచావు మేముచస్తాం, మమ్మల్ని ఎవడు దోచుకుతింటే నీకెందుకు? మాకు సమ్మగా గొంతులు కోసేవాడే కావాలి, నీలా గొంతులో నీళ్ళు పోసే వాడు అవసరంలేదు,,,
నీకు బతకడం తెలీదయ్యా జగన్… ఎప్పుడు బాగుపడతావో ఏందో,,,

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -