అక్తర్ బౌలింగ్‌కి సచిన్ భయపడ్డాడు.. నేను చూశా : అఫ్రిది

3775
Sachin Tendulkar Was Scared Of Facing Shoaib Akhtar: Shahid Afridi
Sachin Tendulkar Was Scared Of Facing Shoaib Akhtar: Shahid Afridi

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కరోనా వైరస్ నుంచి ఇటీవల కోలుకున్నాడు. అయితే ఇతను ఎప్పుడు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా సచిన్ టెండూల్కర్‌ని లక్ష్యంగా చేసుకుని నోరుజారాడు. అప్పట్లో పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ ని ఎదుర్కోనేందుకు సచిన్ భయపడేవాడని.. ఓ సారి సచిన్ కాళ్ళు వణకడం తాను గమనించనని చెప్పాడు.

“మైదానంలో మిడాఫ్ లేదా కవర్స్‌లో ఫీల్డింగ్ చేసేవారికి.. క్రీజులోని బ్యాట్స్‌మెన్‌ బాడీ లాంగ్వేజ్‌ని దగ్గర నుంచి పరిశీలించే వీలు ఉంటుంది. అప్పట్లో అక్తర్ ని ఎదుర్కోనేందుకు సచిన్ భయపడ్డాడు.. ఓ మ్యాచ్ లో స్వ్కేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. షోయబ్ అక్తర్ బౌలింగ్‌కి రావడంతో క్రీజులోని సచిన్ కాళ్లు వణకడాన్ని నేను చూశా. అయితే అక్తర్ బౌలింగ్ లో ఆడేందుకు తాను భయపడ్డానని సచిన్ ఎలాగూ ఒప్పుకోడు. నేను కూడా సచిన్ ప్రతిసారి భయపడ్డాడని చెప్పడం లేదు.

కొన్ని స్పెల్స్‌లో మాత్రం వెనకడుగు వేశాడని చెప్తున్నా. సచిన్ ఒక్కడే కాదు.. అప్పట్లో చాలా మంది అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు సైతం అక్తర్ బౌలింగ్‌‌లో ఆడేందుకు భయపడ్డారు’’ అని అఫ్రిది చెప్పుకొచ్చాడు. అయితే నిజం చెప్పాలంటే అప్పట్లో అక్తర్ బౌలింగ్ లో సచిన్ భీభత్సం సృష్టించేవాడు. అతని బౌలింగ్ ని ఉతికారేశాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో అక్తర్ విసిరిన బౌన్సర్ బంతిని అప్పర్ కట్ రూపంలో కళ్లుచెదిరే సిక్స్ బాదిన సచిన్.. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

ధోనీని నేను అభిమానించడానికి ముఖ్యకారణం ఇదే : గంగూలీ

వన్డేల్లో సచిన్ మొదటి బంతిని ఎదుర్కోడు : గంగూలీ

కెరీర్ మొదట్లో ధోనీతో మాట్లాడేవాడిని కాదు : ఇషాంత్

విరాట్ వర్కౌట్ వీడియోపై పీటర్సన్ పంచ్.. కోహ్లీ కౌంటర్..!

Loading...