కోహ్లీ మాత్రమే సాహసాలు చేయగలడు : గంభీర్

1622
Gambhir Comments On Virat kohli
Gambhir Comments On Virat kohli

విరాట్ కోహ్లీపై చాలా సందర్భాల్లో విమర్శలు గుప్పించాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. కానీ ఈ సారి తన బాణీ మార్చి మాట్లడాడు. దక్షిణాఫ్రికాపై భారత్ సిరీస్ సొంతం చేసుకున్న క్రమంలో కోహ్లీపై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఓటమి భయం లేకుండా బరిలోకి దిగి ఎదుర్కోవడమే కోహ్లీకి ఉన్న ప్రత్యేకత అని కొనియాడాడు. ధోనీ, ద్రావిడ్, గంగూలీ కెఫ్టెన్లు ఎన్నో విజయాలు సాధించినా.. వారిని మించి కోహ్లీ చరిత్ర సృష్టించాడని అన్నారు.

ఇతర సారథులు జట్టుల్లో ఎక్స్ ట్రా బ్యాట్స్ మన్ ఉంటే బాగుంటుందని భావిస్తే కోహ్లీ మాత్రం ఐదుగురు బౌలర్లతో బరిలో దిగుతాడని వివరించాడు. కోహ్లీ ఫార్ములా.. స్వదేశంలో అయనా విదేశంలో అయినా ఒకేలా ఉంటుందని గంభీర్ తెలిపాడు. ఇలాంటి సాహసాలు చేయగలిగేది కేవలం కోహ్లీ మాత్రమే అని చెప్పుకొచ్చారు.

Loading...