నెట్ బౌలర్ బంతికి రోహిత్, ధావన్ ఔట్..!

1419
19-Year Old Keshav Dabas Dismisses Rohit Sharma, Shikhar Dhawan In Nets
19-Year Old Keshav Dabas Dismisses Rohit Sharma, Shikhar Dhawan In Nets

రేపు ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్ తో భారత జట్టు మొదటి టీ20 మ్యాచ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు అరుణ్ జైట్లీ మైదనంలో ప్రాక్టిస్ చేస్తున్నారు. అయితే ఓ నెట్ బౌలర్ భారత జట్టు దిగ్గజ ఆటగాళ్లను ప్రాక్టిస్ లో ముప్పు తిప్పలు పెట్టిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.

సాధరణంగా మ్యాచ్ లకు సిద్దమైయ్యే సమయంలో ఆటగాళ్లు నెట్స్ లో స్థానిక బౌలర్ల సాయం తీసుకుంటూ ఉంటారు. తాజాగా.. కేశవ్ దబాస్ అనే టీనేజి బౌలర్ కూడా భారత ఆటగాళ్లకు నెట్స్ లో బౌలింగ్ వేశాడు. 19 ఏళ్ల కేశవ్ బౌలింగ్ లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు క్లీన్ బౌల్డ్ కావడం ఇతర ఆటగాళ్లను షాక్ కు గురి చేసింది. కేశవ్ వేసిన బౌలింగ్ ను అంచనా వేయడం లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ విఫలం అయ్యారు.

కేశవ్ బౌలింగ్ చూసిన కోచ్ రవిశాస్త్రి అతనిని అభినందించాడు. ఇక భారత పేసర్ శార్దూల్ ఠాకూర్ ప్రత్యేకంగా కేశవ్ తో మాట్లాడుతూ.. ఏ క్లబ్ కు ఆడుతున్నావు ? అంటు ఆరా తీశాడు. ఢిల్లీకి చెందిన కేశవ్ ఇంటీవలే తండ్రిని కోల్పోయాడు. స్థానిక సురీందర్ ఖన్నా క్రికెట్ అకాడమీ జట్టుకు ఆడే ఈ యువ బౌలర్ గతంలో ఆస్ట్రేలియాతో వన్డే సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లకు నెట్స్ లో సాయం చేశాడు.

Loading...