Thursday, April 25, 2024
- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌కు ఇగ్లండు జ‌ట్టు ఇదే….భారీ మార్పులు

- Advertisement -

మరికొద్ది రోజుల్లో సొంతగడ్డపై జరగనున్న ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ 15 మందితో కూడిన తుది జట్టును ప్రకటించింది.15మంది సభ్యులు గల జట్టులో అంద‌రూ ఆశ్చ‌ర్య‌ప‌డేలా యువ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించారు. ఆర్చర్‌తో పాటు జేమ్స్‌ విన్స్‌, లియామ్‌ డాసన్‌కు చోటు దక్కగా.. డేవిడ్‌ విల్లే, అలెక్స్‌ హేల్స్‌, జోయ్‌ డెన్లీలకు ఉద్వాసన పలికారు.

గత నెలలో ఇంగ్లాండ్ సెలక్టర్లు ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఐర్లాండ్ సిరిస్‌తో పాటు పాకిస్థాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన చేయడంతో వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.నిలకడైన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లోనూ సత్తాచాటే ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని వేదికల్లో, సిరీస్‌ల్లో సత్తాచాటిన వారే కావడం ఆ టీమ్‌కు కలిసొచ్చే అంశం. సొంత గ‌డ్డ కావ‌డంతో ఇంగ్లండుకు క‌ల‌సి వ‌చ్చే అవ‌కాశం.

ఇంగ్లాండ్‌ జట్టు: ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో(వికెట్‌ కీపర్‌), జేమ్స్‌ విన్స్‌, జో రూట్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌(వికెట్‌ కీపర్‌), మొయిన్‌ అలీ, అదిల్‌ రషీద్‌, లియామ్‌ డాసన్‌, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ఫ్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, టామ్‌ కర్రన్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -