కీపింగ్ లో రాహుల్ కంటే పంత్ సెప్షలిస్టూ : ఆకాశ్ చోప్రా

370
aakash chopra says kl rahul should not don gloves in tests
aakash chopra says kl rahul should not don gloves in tests

టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాహుల్ తాత్కాలిక వికెట్‌ కీపర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలానే టెస్టుల్లో కూడా రాణిస్తున్నాడు. అయితే పరిమీత ఓవర్ల క్రికెట్ లో తాత్కాలిక కీపర్ గా ఉన్న రాహుల్ ని టెస్టు మ్యాచుల్లో మాత్రం కొనసాగించవద్దని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్ లో, టెస్టు ఫార్మెట్ మ్యాచుల్లో కీపింగ్ కు చాలా డిఫరెన్స్ ఉందని చోప్రా అభిప్రాయపడ్డాడు. టీమిండియా మాజీ కెఫ్టెన్ ఎంఎస్ ధోనీ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టుకి దూరమయ్యాడు. దీంతో మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. పంత్ వరసగా ఫెయిల్ కావడంతో రాహుల్ సక్సెస్ అయ్యాడు. దాంతో తాత్కాలిక వికెట్ కీపర్ గా పరిమిత ఓవర్ల క్రికెట్ లో రాహుల్ కొనసాగుతున్నాడు. ఇక టెస్ట్ క్రికెట్ లో సైతం కీపర్ గా రాహుల్ కొనసాగాలా ? వద్దా అనే దానిపై చర్చ జరుగుతుంది. ఈ విషయం కొందరు తమ అభిప్రాయాలు చెప్పగా.. ఈ జాబితాలో చోప్రా కూడా చేరాడు.

’కీపింగ్‌ అనేది చాలా ప్రత్యేకమైనది. ఇందుకు తాత్కాలిక కీపింగ్ సెట్ కాదు. రాహుల్ ఓపెనర్ గా, ఇటు మిడిల్ ఆర్డర్ లోనో కొన్సాగాలి. ఇప్పటికీ శిఖర్‌ ధావన్‌-రోహిత్‌ శర్మలే భారత రెగ్యులర్‌ ఓపెనర్లు అని నేను భావిస్తున్నా. రాహుల్‌ను టెస్టుల్లో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా తీసుకోవడం కష్టమే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాహుల్‌ కీపర్‌గా ఆకట్టుకోవడంతో.. సెప్షలిస్టూ కీపరైన రిషభ్ పంత్ ని పక్కన పెట్టడం మంచి నిర్ణయం కాదు. పంత్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి” అని చోప్రా అన్నారు. ఇక చోప్రా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కేవలం ఒక ఏడాది మాత్రమే భారత్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్‌ ఆడిన చోప్రా.. 10 టెస్టులాడి 23 సగటుతో 437 పరుగులు చేశాడు.

చాలాసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. : మహ్మద్ షమీ

ప్రపంచ క్రికెట్‌లో నెంబర్ వన్ ఫీల్డర్ జడేజానే : గంభీర్

డివిలియర్స్‌లోని సామర్థ్యం.. గేల్‌కు ఉన్న బలం.. కోహ్లీకి లేదు : గంభీర్

2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ని అమ్మేశాం : శ్రీలంక మాజీ క్రీడామంత్రి

Loading...