Friday, April 26, 2024
- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనె అత్యంత చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకున్న ఆప్ఘ‌న్ బౌల‌ర్ ర‌షీత్ ఖాన్

- Advertisement -

ప్ర‌పంచ క‌ప్‌లో భాగంగా మాంచెస్టర్‌లో ఆప్ఘ‌న్‌, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్ మేన్ బౌల‌ర్ల‌పై ఎలాంటి క‌నిక‌రం చూప‌కుండా ఊచ‌కోత కోశారు. ఆప్ఘ‌న్ జ‌ట్టుకు ఎయిర్ షో చూపించారు.నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 398 పరుగులు సాధించింది. మ్యాచ్‌ను ఏకపక్షం చేసేసింది. ఆ జట్టు సారథి ఇయాన్‌ మోర్గాన్‌ (148; 71 బంతుల్లో 4×4, 17×6) ఊచకోతకు రికార్డులెన్నో బద్దలయ్యాయి. సిక్సర్ల మోత మోగించాడు. అతడితోపాటు ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (90; 99 బంతుల్లో 8×4, 3×6), జో రూట్‌ (88; 82 బంతుల్లో 5×4, 1×6), మొయిన్‌ అలీ (31*; 9 బంతుల్లో 1×4, 4×6) విధ్వంసం సృస్టించారు.

ఇద‌లా ఉంటె ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో అఫ్గానిస్తాన్‌ యువ సంచలనం రషీద్‌ ఖాన్‌ ఒకడు. అయితే ఎవ్వరూ ఉహించని చెత్త రికార్డును రషీద్‌ ఖాన్‌ మూటగట్టుకున్నారు. కనీసం వికెట్‌ కూడా తీయకుండా 9 ఓవర్లు వేసిన రషీద్‌ 110 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రషీద్‌ నిలిచాడు.

మరొకవైపు వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అఫ్గాన్‌ బౌలర్‌ చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో అఫ్గాన్‌ తరఫున నైబ్‌ 101 పరుగులు ఇస్తే, దాన్ని రషీద్‌ బ్రేక్‌ చేశాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ 11 సిక్సర్లు సాధించడం ఇక్కడ గమనార్హం. గతంలో ఆసీస్ బౌలర్ లూయిస్ సౌతాఫ్రికాపై 10 ఓవర్లలో 113 పరుగులు ఇచ్చుకున్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -