Tuesday, April 23, 2024
- Advertisement -

హార్ధిక్ పాండ్యాపై ప్ర‌శంశ‌లు కురిపించిన ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు లాన్స్ క్లూసెనర్…

- Advertisement -

స‌ఫారీల‌తో టెస్ట్ సిరీస్‌కు భార‌త జ‌ట్టు సిద్ద‌మ‌య్యింది. శుక్ర‌వారంనుంచి స‌ఫారీ జ‌ట్టుతో భారత్ జట్టు తొలి టెస్టులో దక్షిణాఫ్రికాతో ఢీకొట్టనుంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు మంచి ఫామ్‌లో ఉంది. జ‌ట్టు ఎప్పుడూ లేనంత స‌మ‌తూకంతో ఉంది. జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య చేరికతోనే భారత జట్టులో సమతూకం వచ్చిందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ క్లూసెనర్ అభిప్రాయపడ్డాడు.

ఈ సిరీస్‌లో హార్దిక్ పాండ్య కీలక ఆటగాడని.. భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి‌కి తుది జట్టు ఎంపికలో బ్యాట్స్‌మెన్/ ఫాస్ట్ బౌలర్‌గా అతను అదనపు ఆప్షన్ అవుతాడని వివరించారు. గత ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా మెరుపు శతకం, అర్ధ శతకంతో హార్దిక్ రాణించారు.

భారత జట్టులో ఆల్‌రౌండర్‌గా బ్యాటింగ్, బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య సమతూకం తెచ్చాడు. అతనిలో చాలా నైపుణ్యం ఉంది. మీడియం పేస్ బౌలింగ్ చేయగలడు, లోయర్ ఆర్డర్‌లో బ్యాట్‌తో పరుగులూ రాబట్టగలడు. దక్షిణాఫ్రికా బౌలర్లు ఈ హిట్టర్‌ని నిలువరించడానికి షార్ట్ పిచ్‌ బంతులు వేస్తారని నేను అనుకుంటున్నా. కానీ.. అప్పుడు హార్దిక్ కొంచెం సహనం పాటిస్తే.. సఫారీ బౌలర్లకి తర్వాత తిప్పలు తప్పవు’ అని క్లూసెనర్ వివరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -