Saturday, April 20, 2024
- Advertisement -

టెస్ట్ నెంబర్ 1 బ్యాట్స్ మేన్ స్మిత్ పై క్రికెట్ దిగ్గజం సచిన్ కామెంట్…

- Advertisement -

యాషెస్‌ సిరీస్‌లో తన బ్యాటింగ్‌ పవర్‌తో ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఇంగ్లండ్ కు చుక్కలు చూపిస్తున్నారు.పరుగుల వరద పారిస్తున్నారు. స్మిత్‌ వికెట్‌ దక్కితే చాలు.. మ్యాచ్‌ గెలిచినట్లేనని ఇంగ్లండ్‌ భావించేంతగా ప్రభావితం చేస్తున్నాడు.యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో రెండు భారీ సెంచరీలు, రెండో టెస్టులో 92 పరుగులు, ఇక నాల్గో టెస్టులో డబుల్‌ సెంచరీ ఇలా పరుగుల వరద సృష్టిస్తునే ఉన్నాడు స్మిత్‌. గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరం అయిన సంగతి తెలిసిందే.

స్మిత్ ను ఔట్ చేసేందకు ఇంగ్లండ్‌ కోచింగ్‌ సిబ్బందితో పాటు ఫీల్డ్‌లో జో రూట్‌ బృందం ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసినా అవన్నీ స్మిత్ ముందు పనిచేయడంలేదు. స్మిత్ బ్యాటింగ్ పై క్రికెట్ దిగ్గజం సచిన్ ప్రశంసల జల్లు కురిపించారు.స్మిత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఎవ్వరికీ అర్థం కాడని అంటున్నాడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. అతని బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఒక వైవిధ్యంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘ స్మిత్‌ది చాలా క్లిష్టమైన బ్యాటింగ్‌ టెక్నిక్‌. అది అతనికి మాత్రమే సొంతం. కాకపోతే స్మిత్‌ ఆలోచనా విధానం అమోఘం. క్రికెట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపును స్మిత్‌ సాధించడానికి ఇదే కారణం’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -