రిషభ్ పంత్‌.. ధోనీ కన్నా ప్రతిభావంతుడు : నెహ్రా

1087
ashish nehra says rishabh pant has a more natural talent than ms dhoni
ashish nehra says rishabh pant has a more natural talent than ms dhoni

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. భారత మాజీ కెప్టెన్ ధోనీ కన్నా రిషభ్ పంతే సహజమైన ప్రతిభకలిగి ఉన్నాడని అన్నారు. ధోనీ స్థానాన్ని అతను భర్తీ చేయగలడని అభిప్రాయపడ్డాడు. శనివారం ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీతో గడిపిన క్షణాలను నెమరవేసుకున్న నెహ్రా.. అతని వారుసుడు రిషభ్ పంతేనని జోస్యం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 23 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ధోనీ కంటే 22 ఏళ్ల పంత్‌లో పరిపక్వత, సహజమైన ప్రతిభ ఎక్కువుందన్నాడు. ధోనీలా ధృడంగా పంత్ నిలబడితే.. ధోనీ స్థానాన్ని భర్తీ చేయగలడు అన్నారు.

ఇక ధోనీ గురించి మాట్లాడుతూ.. సీనియర్లకు ధోనీ చాలా మర్యాద ఇచ్చేవాడని.. అంతేస్థాయిలో వారి నుంచి గౌరవం పొందేవాడన్నాడు. ఏనాడు కూడా తాను అనుకుంటున్న విషయాలను ఆటగాళ్లపై రుద్దే ప్రయత్నం చేయలేదు. ఆటగాళ్ల అభిరుచి తగ్గట్లే వ్యూహాలు రచించేవాడు మైండ్ రీడింగ్ సామర్థ్యమే అతన్ని ఓ గొప్ప సారథిగా నిలబెట్టింది అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.

రిటైర్మెంట్ తర్వాత ధోనీ, నేను వెక్కివెక్కి ఏడ్చాం : రైనా

ధోనీని ఇబ్బంది పెట్టాలనే బీమర్ వేశా : అక్తర్

ఐపీఎల్ మ్యాచ్‍లు ఆడటం కష్టమే.. అంత ఈజీ కాదు ఇప్పుడు : రోహిత్

ధోనీతో నన్ను పోల్చడం నాకు నచ్చలేదు : రోహిత్ శర్మ

Loading...