Friday, April 19, 2024
- Advertisement -

అసియా క‌ప్‌నుంచి లంక ఔట్‌…

- Advertisement -

ఆసియా క‌ప్‌లో సంచ‌ల‌నం న‌మోద‌య్యింది. ఆసియా కప్ ట్రోఫీలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక జట్టుకు దారుణ పరాభవం ఎదురైంది. పేవ‌ల‌మైన బ్యాటింగ్ంగో ట్రోఫీనుంచి నిష్క్ర‌మించింది. మొదటి మ్యాచులో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన శ్రీలంక జట్టు.. సోమవారం అబుదాబిలోని షేక్ జయెద్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచులో పసికూన అఫ్గానిస్థాన్‌ చేతిలో 91 పరుగుల తేడాతో పరాయజయాన్ని చవిచూసింది.

అఫ్గానిస్థాన్‌ విసిరిన 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో158 పరుగులకే ఆలౌటైంది. దీంతో గ్రూప్‌ దశలోనే శ్రీలంక జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన జట్టు, తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఏమాత్రం అనుభవం లేని ఆఫ్గనిస్థాన్ పైనా చేతులెత్తేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న అఫ్ఘాన్‌ జట్టులో టాప్‌ ఆర్డర్‌ మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఓపెనర్లు షెజాద్‌ (34; 47 బంతుల్లో 4×4, 1×6), ఇసానుల్లా (45; 65 బంతుల్లో 6×4) లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 57 పరుగులు జత చేసింది. ఓపెనర్లిద్దరిని స్పిన్నర్‌ ధనంజయ (2/39) ఔట్‌ చేశాడు. కెప్టెన్‌ అస్గర్‌ (1) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో అఫ్గాన్‌ జట్టు 110/3తో నిలిచింది. ఈ స్థితిలో రహ్మత్‌ షా, హస్మతుల్లా (37; 52 బంతుల్లో 2×4)తో కలిసి ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు.

ఒక దశలో 190/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. రహ్మాత్‌ను చమీర ఔట్‌ చేసి ఈ జోడీని విడగొట్టాడు. నాలుగో వికెట్‌కు రహ్మత్‌-షాహిది 80 పరుగులు జత చేశారు. ఆ తర్వాత పెరీరా విజృంభించడంతో అఫ్గాన్‌ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో గుల్బదిన్‌ (4), రషీద్‌ (13), ముజీబుర్‌ (0) వికెట్లను పెరీరా ఖాతాలో వేసుకున్నాడు.

క్ష్య‌ఛేద‌న‌కు దిగిన లంక ఆరంభంలోనే త‌డ‌బ‌డింది. మొదటి ఓవర్ రెండో బంతికే కుశాల్‌ మెండిస్‌ (0)ను ముజీబ్‌ డకౌట్‌ చేశాడు. తర్వాత తరంగ (36; 3 ఫోర్లు), డిసిల్వా (23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మరో వికెట్ పడకుండా కాసేపు అడ్డుకున్నారు. అయితే ఉపుల్‌ తరంగ (36), ధనంజయ డిసిల్వా (23) కాస్త నిలదొక్కుకోవడంతో రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించగలిగారు. ఆ తర్వాత తిసార పెరీర (28), మాథ్యూస్‌ (22) మినహా ఏ బ్యాట్స్‌మెన్‌ కూడా ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కోలేకపోయారు. దీంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి అవమానకరంగా ఓడింది. తిసారకు ఐదు, అకిలకు రెండు వికెట్లు దక్కాయి. రహమత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ లభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -