Thursday, April 25, 2024
- Advertisement -

ర‌వీందర్ జ‌డేజ దాటికి క‌ష్టాల్లో బంగ్లా..85/5

- Advertisement -

భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా‌ పునరాగమనంలో అదరగొడుతున్నాడు. ఏడాది తర్వాత మళ్లీ వన్డే జట్టులో చోటు సంపాదించుకున్న ఈ ఆల్‌రౌండర్.. ఆసియా కప్‌లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు.

భారత బౌలర్ల దాటికి బంగ్లా వికెట్లు టప టపా కుప్పకూలుతున్నాయి. కేవలం 85 పరుగులకు బంగ్లా జట్టు కీలక ఐదు వికెట్లు కోల్పోయింది. ఐదో వికెట్ రూపంలో ముష్పికర్ రహీమ్ జడేజా బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో మొత్తంగా జడేజా ఖాతాలోకి మూడు వికెట్లు చేరాయి. కాస్త నిలకడగా ఆడుతున్న మష్పికర్ రహీమ్ (21 పరుగులు 45 బంతుల్లో)ను తన స్పిన్ బౌలింగ్ తో జడేజా బోల్తా కొట్టించాడు.

ఆసియా కప్ లో మరోసారి భారత బౌలర్ల జోరు కొనసాగుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీంఇండియా బౌలర్ల దాటికి ఆదిలోనే బంగ్లా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. మొదట బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్( 7 పరుగులు 16 బంతుల్లో) ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే మరో ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ను బుమ్రా ఔట్ చేశాడు. ఇక జడేజా వేసిన 9వ ఓవర్లో షకీబ్ అల్ హసన్( 17 పరుగులు 12 బంతుల్లో) ఔటయ్యాడు.

స్టార్‌ ఆటగాడు ముష్ఫికర్‌ రహీమ్‌ (21; 45 బంతుల్లో 1×4)ను 17.6వ బంతికి పెవిలియన్‌ పంపించాడు జ‌డేజ‌. చాహల్‌ క్యాచ్‌ అందుకున్నాడు. మహ్మదుల్లా (13 , 31 బంతుల్లో), మొసాదిక్ 28 బందుతుల్లో 7 క్రీజులో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -