Wednesday, April 24, 2024
- Advertisement -

ఆసియాక‌ప్‌నుంచి పాండ్యా ఔట్ .. మ‌నీష్ పాండే స్ట‌న్నింగ్ క్యాచ్…

- Advertisement -

తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న భారత ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా ఆసియా కప్‌ టోర్నీ నుంచి వైదొలిగాడు. బుధవారం జరిగిన భారత్‌ – పాక్‌ మ్యాచ్‌ మధ్యలో పాండ్య నొప్పి తాళలేక అర్ధాంతరంగా మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. నొప్పి తగ్గకపోవడంతో ఆసియా కప్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో పాండ్యా ఆడట్లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడి స్థానంలో దీపక్‌ చాహర్‌ను తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

పాండ్యాకు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వ‌చ్చిన మనీష్‌ పాండే అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టి పాక్ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ పెవిలియ‌న్‌కు పంపించాడు. కేదార్‌ జాదవ్‌ వేసిన 25 ఓవర్‌ ఐదో బంతిని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే ఆ దిశగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్‌ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా బంతిని అందుకున్నాడు.

బంతిని అందుకోవడం కోసం కుడివైపు పరిగెత్తుకొచ్చిన పాండే.. తర్వాత నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ దాటాడు. ఈలోగానే సమయస్ఫూర్తితో బంతిని గాల్లోకి విసిరిన అతడు.. తర్వాత తిరిగి బౌండరీ లోపలికి వచ్చి మళ్లీ క్యాచ్‌ను అందుకున్నాడు. పాండే స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో సర్ఫరాజ్ (6) నిరాశగా పెవిలియన్ చేరాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -