Saturday, April 20, 2024
- Advertisement -

ఆసియా క‌ప్..బంగ్లాపై ఫిల్డింగ్ ఎంచుకున్న ఇండియా

- Advertisement -

ఆసియాకప్‌ సూపర్‌-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రోహిత్‌ మాట్లాడుతూ..‘ఇక్కడ కొన్ని మ్యాచ్‌లు ఆడాం. ఫ్లడ్‌ లైట్స్‌ కింద ఆడటమే ఇక్కడ బెటర్‌.. దీంతో ఛేజింగ్‌కు మొగ్గుచూపుతున్నాం’ అని తెలిపాడు.

టోర్నీ గ్రూప్ దశలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు వరుసగా హాంకాంగ్, పాకిస్థాన్‌పై ఘన విజయాలతో మంచి జోరుమీదుంది. అఫ్గానిస్తాన్‌తో ఓడిన బంగ్లా ఈ మ్యాచ్‌ ఎలాగైనా గెలిచి టైటిల్‌ రేసుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తుంది. విశ్రాంతి లేకుండా బరిలోకి దిగడం బంగ్లాదేశ్‌కు ప్రతికూలం కానుంది.

వన్డేల్లో ఇప్పటి వరకు భారత్, బంగ్లాదేశ్ జట్లు మొత్తం 33సార్లు తలపడగా.. భారత్ 27 మ్యాచ్‌ల్లో గెలుపొంది.. ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్‌ ఏడో స్థానంలో ఉంది

తుది జట్లు
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, రాయుడు, దినేశ్‌ కార్తీక్, ధోని, కేదార్‌ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా.
బంగ్లాదేశ్‌: మొర్తజా (కెప్టెన్‌), లిటన్‌ దాస్, మోమినుల్‌ హక్, షకీబ్, మిథున్, మçహ్ముదుల్లా, మొసద్దిక్‌ హొస్సేన్, హసన్‌ మిరాజ్, రుబెల్‌ హొస్సేన్, నజ్ముల్, అబు హైదర్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -