Thursday, March 28, 2024
- Advertisement -

ధోనీని వ‌ద‌ల‌ని కెప్టెన్సీ….

- Advertisement -

ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు, కెప్టెన్సీ మాత్రం ధోనీని వదల్లేదు . అసియాక‌ప్‌కు విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వ‌డంతో రోహిత్‌శ‌ర్మ కెప్టెన్సీగా బాధ్య‌లు తీసుకున్నారు. టీమిండియా విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ఆట‌లో కెప్టెన్ రోహిత్ అయినా అన‌ధికారికంగా ధోనీనే బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు అన‌డానికి నిన్న బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఉదంత‌మే ఇందుకు కార‌ణం.

పెద్దగా అనుభవం లేకపోవడంతో క్లిష్ట పరిస్థితుల్లో రోహిత్ శర్మ తడబాటుని గమనించిన ధోనీ.. చొరవ తీసుకుని సలహాలు, సూచనలతో అతనికి అండగా నిలుస్తున్నాడు. శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీ సూచన మేరకు ఫీల్డింగ్‌ మార్పులు చేసిన రోహిత్ శర్మ.. వెంటనే ఫలితం రాబట్టాడు.

జడేజా వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో రెండు, మూడో బంతులను బంగ్లాదేశ్‌ కీలక బ్యాట్స్‌మన్‌ షకీబ్‌ వరుసగా ఫోర్లుగా బాది జోరు మీదున్నాడు. దీంతో.. జడేజాతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒత్తిడిలో ఉన్నట్లు గమనించిన ధోనీ.. చొరవ తీసుకుని అప్పటి వరకు స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శిఖర్ ధావన్‌ని షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ కోసం ఉంచాల్సిందిగా రోహిత్ శర్మకి సూచించాడు.

ఉత్కంఠకర మ్యాచ్‌ల్లో సైతం ఎలాంటి ఆందోళన చెందకుండా జట్టును ముందుకు నడిపించాడు. అందుకే ధోనీని అభిమానులు ముద్దుగా మిస్టర్‌ కూల్‌ అని పిలుచుకుంటారు. భారత జట్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి ధోని తప్పుకోవచ్చేమో కానీ, అతడి విలువైన సలహాలు ఎప్పుడూ జట్టుకు ఉపయోగపడుతూనే ఉన్నాయి.

https://twitter.com/KingVJfan/status/1043357314089025537

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -