Wednesday, April 24, 2024
- Advertisement -

ఆసియాక‌ప్‌లో భార‌త్‌ను ఢీకొట్టే పాక్ జ‌ట్టు …

- Advertisement -

దాయాదుల పోరుకు రంగం సిద్ధ‌మ‌య్యింది. ఈనెల 16నుంచి మొద‌ల‌వ‌నున్న ఆసియాక‌ప్ వేదిక కానుంది. ఇప్ప‌టికే టీమిండియా జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. పాకిస్థాన్ జట్టుని సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. జట్టు ఎంపికలో పాక్ సెలక్టర్లు ఫిట్‌నెస్, ఫామ్‌కి పెద్దపీట వేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి జరగనున్న ఆసియా కప్ కోసం 16 మందితో కూడిన జట్టుని ఎంపిక చేశారు.

టోర్నీలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఒక క్వాలిఫయర్ జట్టు పోటీపడనున్నాయి. ఈనెల 16న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్.. 19న భారత్‌తో మ్యాచ్ ఆడనుంది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ భారత్, పాకిస్థాన్ జట్లు మ్యాచ్ ఆడనుండటంతో.. సుదీర్ఘ చర్చ అనంతరం పాకిస్థాన్ సెలక్టర్లు జట్టుని ఎంపిక చేశారు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ఎడమచేతి వాటం హిట్టర్ షాన్ మసూద్‌కి జట్టులో తొలిసారి చోటు దక్కింది. సీనియర్ క్రికెటర్మలు అయిన హ్మద్ హఫీజ్, ఇమాద్ వసీమ్‌పై వేటు వేశారు.

జట్టు ఎంపికకి ముందు ఆటగాళ్లకి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాం. ఆ టెస్టులో ఫెయిలవడంతో మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీమ్‌‌ని పక్కన పెట్టాం. జట్టు ఫిట్‌నెస్ విషయంలో ఉదాసీనతకి తావులేదు’ అని చీఫ్ సెలక్టర్ ఇంజిమా ఉల్ హక్ స్పష్టం చేశాడు.

పాకిస్థాన్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ అజామ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, హారీస్ సోహాలి, సదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, అష్రప్, హసన్ అలీ, మహ్మద్ అమీర్, జునైద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -