Friday, March 29, 2024
- Advertisement -

పాకిస్థాన్‌తో ఇండియా గెలుపు తెలికేనా?

- Advertisement -

ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్ అదరగొడుతుంది. ఆడిన మూడు మ్యాచ్‌లో విజ‌యం సాధించింది భార‌త్ . ఆసియా కప్‌లో భార‌త్ మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమి తెల్చుకోనుంది. ఇండో–పాక్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌ కూడా టీమిండియా జోరు ముందు తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌… ఇలా ఏ విభాగాన్ని చూసినా, ఏ ఆటగాడి సత్తాను పరిశీలించినా భారత్‌ ఇప్పుడు అసాధారణ జట్టుగా మారింది. మొదటి మ్యాచ్‌లో సెంచరీ బాదిన శిఖర్‌ గత రెండు మ్యాచ్‌ల్లోనూ 46, 40 పరుగులు చేశాడు. ఓపెనింగ్‌లో అతనితోపాటు కెప్టెన్‌ రోహిత్‌ కూడా టచ్‌లోకి వచ్చాడు. పాక్, బంగ్లాదేశ్‌లపై అర్ధసెంచరీలతో సత్తాచాటుకున్నాడు.

మిడిలార్డర్‌లో రాయుడు, దినేశ్‌ కార్తీక్‌లు బాగా ఆడుతున్నారు. ఇండియాకు పూర్తి విరుద్ధంగా ఉంది.పాకిస్థాన్ ప‌రిస్థితి.గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ చివరి ఓవర్‌లో అధిగమించింది. టాపార్డర్‌లో బాబర్‌ ఆజమ్‌ ఒక్కడే ప్రతీ మ్యాచ్‌లోనూ స్థిరంగా ఆడుతున్నాడు. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ బ్యాటింగ్‌కు దిగిన రెండుసార్లూ (6, 8 పరుగులు) విఫలమయ్యాడు.ఇండియాను ఓడించి ఫైన‌ల్ బెర్త్‌ను ఫిక్స్ చేసుకోవాల‌ని భావిస్తుంది పాకిస్థాన్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -