Thursday, April 18, 2024
- Advertisement -

టీమిండియాకు భారీ షాకిచ్చిన ఆసీస్ జట్టు

- Advertisement -

అతిథ్య ఆస్ట్రేలియా జ‌ట్టు టీమిండియాకు భారీ షాకిచ్చింది. ఆసీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో భారత్‌ ఓటమి పాలైంది.భారత్ తమ ముందు ఉంచిన 359 పరుగుల లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచినా దాన్ని కాపాడుకోవడంలో భారత్‌ విఫలమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌(143), రోహిత్‌ శర్మ(95) ప‌రుగుల‌తో రాణిచ‌డంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది.

359 పరుగుల భారీ ల‌క్ష్యంలో బ‌రిలోకి దిగిన ఆసీస్ జ‌ట్టు అరోన్‌ ఫించ్‌(0), షాన్‌ మార్ష్‌(6) వికెట్లను ఆదిలోనే చేజార్చుకుంది. హ్యాండ్స్‌ కోంబ్‌(117), ఉస్మాన్‌ ఖాజా(91)ల జోడి మూడో వికెట్‌కు 192 పరుగులు జత చేయడంతో ఆసీస్ గాడిలో ప‌డింది. చివ‌ర్లో ఆస్టన్‌ టర్నర్ మ్యాచ్‌లో ట‌ర్న్ చేసి వారి జ‌ట్టుకు విజ‌యాన్నిందించాడు.. దీంతో ఐదు మ్యాచుల వన్డే సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఐదో వ‌న్డే 13 తేదీన ఢిల్లీలో జ‌ర‌గ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -