Tuesday, April 23, 2024
- Advertisement -

ధోని రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అనిల్ కుంబ్లే..

- Advertisement -

ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచకప్ తర్వాత రెండు నెలల పాటు క్రికెట్ కు ధోనీ దూరమైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ లో వైఫల్యంతో ధోని రిటైర్మెంట్ ప్రకటించాలని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ధోని కూడా యువఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనె ఉద్దేశ్యంతో రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యారు.

ధోని రిటైర్మెంట్ పై అనిల్ కుంబ్లే ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీలో ధోనీని ఆడించాలనుకుంటె రెగ్యులర్ గా జట్టుతో పాటె ఉంచాలని బీసీసీఐకి సూచించారు.‘ధోని రిటైర్మెంట్‌ అంశానికి సంబంధించి ఎవ్వరికీ క్లారిటీ లేదు. అతను ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాడో తెలియదు కాబట్టి..టీ20 ప్రపంచకప్‌లో ధోనిని ఆడించాలని వారు భావిస్తే..? రెగ్యులర్‌గా అతనికి జట్టులో చోటు కల్పించాలి.
అలా కాదనుకుంటె యువ క్రికెటర్లతో ముందుకు వెళ్లాలని భావిస్తే మాత్రం… గౌరవప్రదమైన వీడ్కోలుకు ధోనీ అన్ని విధాలా అర్హుడని చెప్పారు. రిటైర్మెంట్ కావాలనే నిర్ణయానికి ధోనీ వచ్చినప్పుడు… ఆయనకు గౌరవంగా వీడ్కోలు పలకాలని సూచించారు.

దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మూడు టీ20ల సిరీస్‌కు ధోనిని ఎంపిక చేయలేదు. తాను దూరంగా ఉండదల్చుకున్నానని ధోని చెప్పడంతోనే అతనికి విశ్రాంతి ఇచ్చామని చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ వివరణ కూడా ఇచ్చాడు. ధోని తప్పించాలనే నిర్ణయం సెలక్టర్లదేనని, దాంతో కాదనలేక ధోని దూరంగా ఉన్నాడనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో అనిల్ కుంబ్లే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -