Thursday, March 28, 2024
- Advertisement -

టీమిండియా కోచ్ ప్రకటన ఎప్పుడంటే…?

- Advertisement -

టీమిండియా కోచింగ్ స్టాఫ్ బృందం కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వందల దరఖాస్తులు రాగా వాటిలో ఆరు దరఖాస్తులను మాత్రమే హెడ్ కోచ్ పదవికి సెలక్ట్ చేసింది కపిల్ దేవ్ సెలక్షన్ కమిటీ . కపిల్‌దేవ్‌, అన్షుమన్ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ భారత ప్రధాన కోచ్ ఎంపికను చేపట్టింది. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లను మాత్రమే కపిల్‌ కమిటీ ఇంటర్వ్యూలకు పిలవనుంది.

టీమిండియా ప్రధాన కోచ్‌ ఎంపిక ఫలితాలను బీసీసీఐ శుక్రవారమే ప్రకటించనున్నట్లు సమాచారం. ముంబయిలో ప్రధాన కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ముంబయికి రాలేని వాళ్లు స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అన్షుమన్‌ గైక్వాడ్‌ బహిరంగంగానే రవిశాస్త్రికి మద్దతు పలకడంతో ప్రస్తుత కోచ్‌నే మళ్లీ ఎంపిక చేస్తారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అయితే కోచ్‌ ఎంపికలో కోహ్లి అభిప్రాయాల్ని కమిటీ పరిగణనలోకి తీసుకోదని, స్వతంత్రంగా వ్యవహరిస్తుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌ల నుంచి రవిశాస్త్రికి గట్టి పోటీ ఎదురు కావచ్చని తెలుస్తోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -