Wednesday, April 24, 2024
- Advertisement -

లండన్ కు బూమ్రా…

- Advertisement -

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి గాయం కారణంగా దూరమైన భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను మెరుగైన చికిత్స కోసం లండన్ పంపించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. గత నెలలో ఆటగాళ్లకు నిర్వహించిన సాధారణ రేడియాలజీ పరీక్షలో బుమ్రా వెన్ను భాగంలో చిన్న చీలిక ఉన్న విషయం బయటపడింది. దీంతో ప్రస్తుతం సఫారీలతో జరుగుతున్న సిరీస్‌ను నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించిన సెలక్టర్లు అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు చోటిచ్చిన సంగతి తెలిసిందే.

గాయం చిన్నదే అయినప్పటికీ బుమ్రా పేసర్ కావడంతో గాయం మళ్లీ తిరగబడే అవకాశం ఉండడంతో పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని బీసీసీఐ నిర్ణయించింది. అతని వెంట ఎన్సీఏ హెడ్‌ ఫిజియోథెరపిస్ట్‌ ఆశిస్‌ కౌశిక్‌ వెళుతున్నారు. మరో రెండు-మూడు రోజుల్లో లండన్‌కు వెళ్లనున్నారు. అక్కడ డాక్టర్ల అభిప్రాయం తీసుకుని బుమ్రా ప్రణాళిక ఏమిటనేది ఉంటుందని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు.

గాయం(స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌) నుంచి ఎన్ని రోజులకు తేరుకుంటాడనేది లండన్‌కు వెళ్లిన తర్వాత స్పష్టత వస్తుంది’ అని సదరు అధికారి పేర్కొన్నారు.సాధారణంగా క్రికెటర్లు గాయపడితే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ఉంచి వైద్య చికిత్సలు అందిస్తారు. దీంతో.. గాయపడిన బుమ్రాని కూడా ఎన్‌సీఏలో ఉంచే దాదాపు వారం రోజులు పర్యవేక్షించారు. గాయం సున్నితమైంది కావడంతో మెరుగైన చికిత్స కోసం లండన్ పంపడం మంచిదని అక్కడ ….బ్రిటన్‌లోని స్పెషలిస్ట్‌లకి చూపించాలని బీసీసీఐ నిర్ణయించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -