Thursday, April 25, 2024
- Advertisement -

కోచ్‌గా ఆయ‌నే…

- Advertisement -

గ‌త కొన్ని రోజులుగా భారత క్రికెట్‌ కోచ్ ఎంపిక డ్రామాకు మంగళవారం తెరపడింది.గత కొన్నిరోజుల నుంచి కొనసాగుతున్న సందిగ్థతకు ముగింపు పలుకుతూ మాజీ డైరెక్టర్ రవిశాస్త్రినే కోచ్ గా నియమించింది. రవిశాస్త్రి కోచ్ పదవి రేసులోకి వచ్చిన మరుక్షణమే విరాట్ కోహ్లి కొత్త గురువు అనే దానికి దాదాపు సమాధానం దొరికినప్పటికీ, తాజాగా దానికి ఫుల్ స్టాప్ పడింది.అనిల్ కుంబ్లే స్థానంలో కోచ్ గా ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. 2019 వరల్డ్ కప్ క్రికెట్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, రవిశాస్త్రి క్రికెట్ కెరీర్ గురించి చెప్పాలంటే.. 1981-92 వరకు భారతజట్టుకు రవిశాస్త్రి ప్రాతినిధ్యం వహించారు. 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్ లు ఆయన ఆడారు. టెస్టుల్లో 3,830, వన్డేల్లో 3,108 పరుగులు చేశారు. 1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నారు. 2014-16లో టీమ్ డైరెక్టర్ గా రవిశాస్త్రి పనిచేశారు.

దరఖాస్తులు, ఇంటర్వ్యూలు అంటూ బీసీసీఐ హడావిడి చేసినా ర‌విశాస్త్రి ఎంట్రీతో అంతా మారిపోయింది. సచిన్ టెండూల్కర్ , సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ(సీఏసీ) రవిశాస్త్రి పేరును సూచించగా, అందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అడ్వైజరీ కమిటీ ముందు రవిశాస్త్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గతంలో టీమిండియా డైరెక్టర్ గా పనిచేయడమే రవిశాస్త్రికి బాగా కలిసొచ్చిన అంశం. శ్రీలంక పర్యటనతో రవిశాస్త్రి తన బాధ్యతల్నిచేపట్టే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -