హాట్ కాఫీ దెబ్బ‌…. పాండ్యా, రాహుల్‌లపై విచార‌ణ ముగిసే వ‌ర‌కు సస్పెన్షన్ వేటు…

431
BCCI : Hardik Pandya, KL Rahul Suspended Amid Row Over Sexist Remarks
BCCI : Hardik Pandya, KL Rahul Suspended Amid Row Over Sexist Remarks

నోటి నుంచి మాట జారితే దాన్ని వెన‌క్కి తీసుకోలేము. మ‌రీ ముఖ్యంగా సెల‌బ్రిటీలుగా ఉన్న వాల్ల‌యితే ఆచితూచి మాట్లాడాలి. అలాంటి ప‌రిస్థితే ఇప్పుడు ఇద్ద‌రు టీమిండియా ఆట‌గాళ్లు ఎదుర్కొంటున్నారు. కాఫీ విత్ క‌ర‌ణ్ కార్య‌క్ర‌మంలో రాహుల్‌, పాండ్యాలు మహిళలపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు త‌గిన మూల్యం చెల్లించుకున్నారు. అంతర్జాతీయ క్రికెటర్లమనే సోయి మరిచిన ఈ యువ ఆటగాళ్లు ఓ టీవీ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో బీసీసీఐ, సీఓఏ క‌న్నెర్ర జేసింది.

ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి వన్డేకు టీమ్‌మేనేజ్‌మెంట్‌ ఈ ఇద్దరి ఆటగాళ్లను పక్కన పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇద్ద‌రిపై సస్పెన్షన్ వేటు పడింది. మొద‌ట రెండు వ‌న్డేల‌వ‌రు మాత్ర‌మే నిషేదం విధించాల‌ని చూసినా…విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు సస్పెన్షన్ కొన‌సాగించాల‌ని సీఓఏ బీసీసీఐకి సూచించింది. విచార‌ణ‌న నిమిత్తం ఇద్ద‌రు ఇండియాకు రానున్నారు.

కాఫీ విత్ కరణ్ షోలో మహిళలపై నోరు పారేసుకున్న కారణంగా ఈ ఇద్దరిపై బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. తనకు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఈ విషయాన్ని తన పేరెంట్స్‌తోనూ చెప్పానని ఆ షోలో పాండ్యా చెప్పాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగ‌తి తెలిసిందే.