Thursday, March 28, 2024
- Advertisement -

రాహుల్ కు షాక్ ఇచ్చిన సెలక్షన్ కమిటీ…..టెస్టుజట్టులోకి హిట్ మ్యాన్

- Advertisement -

స్వదేశంలో సఫారీలతో జరిగే సమరానికి సిద్దమవుతోంది టీమిండియా. విండీస్ టూర్ ను విజయవంతంగా ముగించిన కోహ్లీసేన ఇప్పుడు స్వదేశంలో జరిగే సీరీస్ పై ఫోకస్ చేసింది.అక్టోబర్ నెలలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు గురువారం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా వస్తున్న కేఎల్ రాహుల్ ను తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అతని స్థానంలో హిట్ మ్యాన్ ను తీసుకోవాలనె ఆలోచనలో సెలెక్షన్ కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశం కాలేదు. త్వరలో జరిగే టీమ్ సెలక్షన్ సమావేశాల్లో రోహిత్‌ను ఓపెనర్‌గా తీసుకోవాలనే ప్రతిపాదనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నాడు. ఆ మాటలను బట్టి చూస్తె రాహుల్ పై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన రెండు టెస్టులో రాహుల్ విఫలమయ్యాడు. 44, 38, 13, 6 పరుగులు చేసాడు. తొలి టెస్టులో మంచి పరుగులే చేసినా.. భారీ ఇన్నింగ్స్‌లు మాత్రం ఆడలేదు. ఇక రెండో టెస్టులో 19 పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.ఆడిన చివరి 12 ఇన్నింగ్స్‌లలో కనీసం ఒక్కసారి కూడా అర్ధ సెంచరీ చేయలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -