Thursday, April 25, 2024
- Advertisement -

టీమిండియా హెడ్ కోచ్ గా మరో సారి రవిశాస్త్రి కే పట్టం …అధికారికి ప్రకటన

- Advertisement -

కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామితో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ ఇవాళ ముంబయిలో టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే మరో సారి టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రిని కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామితో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ సంరద్భంగా కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ… భారత ఆటగాళ్లపైన, ఇతర అన్ని అంశాలపై రవిశాస్త్రికి పూర్తి అవగాహన ఉందని తెలిపారు. టీ 20 ప్రపంచ కప్‌ 2021 వరకు రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నారు.

2017 జులై 13 నుంచి టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి వ్యవహరిస్తున్నాడు. ప్లేయర్ల నిర్ణయాలను గౌరవిస్తూ కోచ్ గా ఆయన విజయవంతమయ్యారు. రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టాక శ్రీలంకలో మూడు టెస్టుల సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వన్డే సిరీస్, 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది.

మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ కోచ్, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌వంటి సహాయక సిబ్బందిని ఎంపిక చేసేందుకు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -