Wednesday, April 24, 2024
- Advertisement -

కోహ్లికి షాకిచ్చిన బిసిసిఐ

- Advertisement -

ఇండియ‌న్ క్రికెట్ బోర్డు కెప్టెన్ విరాట్ కోహ్లీకి షాకిచ్చింది. ఐపీఎల్ 2019 సీజ‌న్‌లో త‌ప్పిదం చేసిన అంపైర్‌కు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో నిగెల్ లాంగ్ అంపైర్‌గా వ్యవ‌హారిస్తున్నాడు. అయితే అత‌ను ప్ర‌క‌టించిన నిర్ణ‌యం ఆర్సీబీ జ‌ట్టు ఓట‌మికి కార‌ణం అయింది. ఆర్సీబీ బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన ఓ ఓవ‌ర్‌లోని బంతిని నోబాల్‌గా ప్ర‌క‌టించాడు. అయితే ఇది రిప్లేలో నోబాల్ కాద‌ని తేల‌డంతో అంపైర్‌తో గొడ‌వ‌కు దిగారు ఉమేశ్ యాదవ్, కెప్టెన్ కోహ్లీ. అయితే ఆ స‌మ‌యంలో త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నాడు నిగెల్ లాంగ్. త‌రువాత తన త‌ప్పుపై తానే ఆగ్ర‌హించుకున్నాడు. ఆ కోపంలో డోర్‌ని కూడా ప‌గ‌ల‌గొట్టాడు నిగెల్ లాంగ్. దీనిపై స్టేడియం అధికారులు బిసిసిఐ కూడా ఫిర్యాదు చేశారు.

తాజాగా ఈ వివాదంపై బిసిసిఐ కూడా స్పందించింది. మ‌నుషులు త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం అని, నిగెల్ లాంగ్ చేసింది కూడా పెద్ద త‌ప్పు కాద‌ని బిసిసిఐ అధికారి ఒక‌రు తెలిపారు. ఈ విష‌యంలో కోహ్లీకి షాకిచ్చింది బిసిసిఐ. కోహ్లీ అంపైర్‌ని అలా ప్ర‌శ్నించి ఉండకూడ‌ద‌ని బిసిసిఐ అధికారు ఒక‌రు చెప్పుకొచ్చారు. వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్‌కు నిగెల్ లాంగ్ అంపైర్‌గా వ్య‌వ‌హారిస్తున్నాడు. మ‌రి దీనిపై కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -