Thursday, April 25, 2024
- Advertisement -

టీమిండియా కోచ్‌పై వేటు…. కొత్త కోచ్ వేట‌లో బీసీసీఐ

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్ చేతి భార‌త్ ఓడిపోవ‌డంతో జ‌ట్టులో బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటోంది. వ‌న్డేల్లో కోహ్లీని కెప్టెన్సీ నుంచి త‌ప్పించి రోహిత్‌కు ప‌గ్గాలు అప్ప‌గిచ్చేందుకు బోర్డు సిద్ద‌మ‌వుతోంది. మ‌రో వైపు కోచ్ ర‌విశాస్త్రి పైనా కూడా తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో కోచ్‌ను త‌ప్పించేందుకు నిర్ణ‌యం తీసుకుంది.

త్వ‌ర‌లోనె భారత క్రికెట్ జట్టుకు కొచ్చ కోచ్ రానున్నారు. కోచ్‌తో పాటు జ‌ట్టుస‌హాక సిబ్బందిపై ఇప్ప‌టికే వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. కోచ్ తో పాటు సహాయ సిబ్బంది నియామకం కోసం త్వరలోనే బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేయనుంది.

వ‌చ్చె నెల‌లో భార‌త్ విండీస్ టూకు వెల్ల‌నుంది. వరల్డ్ కప్ తో రవిశాస్త్రి పదవీకాలం ముగిసినా, వెస్టిండీస్ తో టూర్ నేపథ్యంలో కాంట్రాక్ట్ ను 45 రోజుల పాటు పొడిగించారు. సెమీఫైన‌ల్‌నుంచి భార‌త్ వైదొల‌గ‌డంతో ర‌విశాస్త్రికి మ‌రో అవ‌కాశంగాని, కోచ్ ప‌ద‌వీ కాలం పొడిగించేందుకు బీసీసీ సిద్దంగా లేన‌ట్లు తెలుస్తోంది.

రవిశాస్త్రితో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ లతో పాటు, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ ల స్థానంలోనూ కొత్తవారు రానున్నారు. వరల్డ్‌ కప్‌ వైఫల్యం తరువాత జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌, ట్రైనర్‌ శంకర్‌ బసులు ఇప్పటికే తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.సెప్టెంబరు 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే పోటీల సమయానికి కొత్త కోచ్, అతని సహాయకుల ఎంపిక పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది

అనిల్‌ కుంబ్లే తర్వాత 2017లో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి నియమితుడయ్యాడు. అతడి హయాంలో ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ మినహా భారత్‌ ఎటువంటి మేజర్‌ టోర్నీలు గెలవలేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -