Thursday, March 28, 2024
- Advertisement -

బుమ్రా నోబాల్‌ కారణంగా పాక్ తో భారత్‌ ఓడిపోయింది : భువనేశ్వర్

- Advertisement -

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఫాస్ట్ బౌలర్ బుమ్రా నోబాల్ కారణంగానే భారత్ ఓడిపోయిందని బౌలర్ భువనేశ్వర్ కుమార్ అన్నారు. పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా నోబాల్ తప్పిదం వల్ల ఫకార్ జమాన్‌కి లైఫ్ లభించగా.. అతను సెంచరీతో పాక్‌ని తిరుగులేని స్థితిలో నిలిపాడు.

ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో ఫకార్ జమాన్ 3 పరుగుల వద్ద ధోనీకి క్యాచ్ ఇవ్వడంతో ఔటయ్యాడు. కానీ.. రిప్లెలో ఆ బంతి నోబాల్ కావడంతో ఫకార్ జమాన్ మళ్లీ బ్యాట్ పట్టి(114: 106 బంతుల్లో 12×4, 3×6) సెంచరీ బాదేశాడు. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. ఇక భువనేశ్వర్ మాట్లాడుతూ..”బుమ్రా నోబాల్ తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది.

అయితే.. ఆ ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసిపోకుండా ఉండేందుకు చాలా పోరాడాం. కానీ.. దురదృష్టకరంగా.. ఓడిపోయాం. పాకిస్థాన్ క్రికెటర్ల తక్కువ స్కోరుకే టీమిండియాని కట్టడి చేయగలిగారు. ఆ ఫైనల్ మ్యాచ్ ఓటమికి సరైన కారణం చెప్పలేం. కానీ బుమ్రా నోబాల్ మ్యాచ్ లో కీలక మలుపు” అని భూవనేశ్వర్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ యువ ఆటగళ్ళకి రోల్‌ మోడల్‌.. : శ్రేయాస్

టీ20 వరల్డ్‌కప్.. ధోనీ వ్యూహమే వల్లే గెలిచింది : హార్దిక్

జట్టులో ధోనీ లేకుంటే… కోహ్లీ సక్సెస్ కాలేడు : వసీం జాఫర్

జడేజా బెస్ట్ ఫీల్డర్ అని చెప్పే సాక్ష్యం ఇది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -