Thursday, April 25, 2024
- Advertisement -

ఐపీఎల్‌ను ఫాలో అవుతున్న ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్…

- Advertisement -

ఐపీఎల్ లానే ఆస్ట్రేలియాలో క్రికెట్ అభిమానులను అలరించే బిగ్ బాష్ లీగ్ స‌రి కొత్త నిర్ణ‌యం తీసుకొంది. ప్ర‌పంచ‌క‌ప్ లీగ్ ద‌శ‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్లకు ఏం ప్రయోజనం చేకూరుతుందనే వాదన తెర‌పైకి వ‌చ్చింది. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలో కూడా ఐపీఎల్‌ తరహా ప్లేఆఫ్స్‌ను అమలు చేయాలని డిమాండ్‌ తెరపైకి వచ్చింది. దీని వల్ల తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు మేలు జరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అస‌లు విష‌యానికి వ‌స్తే సాధారణంగా ఏ గేమ్ అయినా ప్లే ఆఫ్ దశకు వచ్చే సరికి నాలుగు జట్లు మిగులుతాయి. వాటిల్లో రెండు జట్ల మధ్య పోటీని పెట్టి, ఫైనల్స్ కు వెళ్లే జట్లను తేలుస్తారు. కాని ఐపీఎల్ లో మాత్రం ప్లే ఆఫ్ ఎలిమినేటర్, క్వాలిఫయర్ విధానంలో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఇదే త‌ర‌హాను ఆస్ట్రేలియా నిర్వ‌హించే బిగ్ బాష్ లీగ్, ఐదు జట్లతో ప్లే ఆఫ్ మ్యాచ్ లను నిర్వహించాలన్న వినూత్న నిర్ణయం తీసుకుంది.

ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌ బాష్‌ లీగ్ క్రికెట్ కూడా క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. ఈ పొట్టి లీగ్‌కు ఐపీఎల్‌ మాదిరిగానే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. డిసెంబర్‌ 17 నుంచి మొదలయ్యే బిగ్‌బాష్‌ తొమ్మిదో సీజన్‌లో కొత్త తరహా ఫైనల్స్‌ను నిర్వహించనున్నారు.

లీగ్ దశలో టాప్-5 లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో ‘ది నాకౌట్’ మ్యాచ్ ఆడుతుంది. ది నాకౌట్ లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్ గేమ్ లో ఓడిన జట్టుతో ‘ది చాలెంజర్’ గేమ్ ఆడుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు క్వాలిఫయర్ తో ఫైనల్ ఆడుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఐదో జ‌ట్టుకు మేలు చూకూరుతుంద‌ని క్రీడాభిమానులు కూడా స్వాగ‌తిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -