Thursday, April 25, 2024
- Advertisement -

10 సిక్స‌ర్లు, 11 ఫోర్ల‌తో దుమ్మురేపిన బంగ్లా బ్యాట్స్‌మెన్‌..

- Advertisement -

బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌)లో 61 బంతుల్లో 11 సిక్సర్లు, 10 ఫోర్లు సాయంతో అజేయంగా 141 పరుగులు సాధించాడు. దాంతో కొమిల్లా విక్టోరియన్స్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో త‌న జ‌ట్టు టైటిల్ గెల‌వ‌డంలో ప్ర‌ముఖ పాత్ర పోషించాడు.

మొద‌ట టాస్ గెలిచిన ఢాకా డైనమేట్స్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కొమిల్లా నిర్నీత 20 ఓవ‌ర్ల‌లో 200 లక్ష్యాన్ని ఢాకా డైనమేట్స్‌ ముందుంచింది. త‌మీమ్ ఇగ్బాల్ చెల‌రేగ‌డంతో అంత‌టి భారీ స్కోరును చేసింది. భారీ క్ష్య‌ఛేద‌న‌తో దిగిన ఢాకా పరుగుల ఖాతా తెరవకుండానే సునీల్‌ నరైన్‌ వికెట్‌ను కోల్పోయింది.ఉపుల్‌ తరంగా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు,, 3సిక్సర్లు)-రోనీ తలుక్దర్‌(66; 6 ఫోర్లు, 4 సిక్సర్లు)లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో ఢాకా విజయం దిశగా పరుగులు తీసింది. ఉప‌ల్ త‌రంగ ఔట్ అవ్వ‌డంతో స్కోరు బోర్డు మంద‌గించింది. దీంతో ఢాకా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమి పాలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -