సెంచ‌రీతో ఆదుకున్న పూజారా

489
Cheteshwar Pujara reaches 1st hundred in Australia
Cheteshwar Pujara reaches 1st hundred in Australia

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర పుజారా సెంచరీ చేశాడు.231 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో సెంచరీ సాధించాడు. క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును ఆదుకున్నాడు పూజారా.153 బంతుల్లో అర్థ శతకాన్ని సాధించిన పుజారా.. మరో 78 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పుజారా టెస్టు కెరీర్‌లో 16వ సెంచరీ. మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ బ్యాట్స్‌మెన్ ఎప్ప‌టిలాగే త‌మ వైఫ‌ల్యాల‌ను కొన‌సాగించారు.ఆడిలైడ్‌లో జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లోకేష్‌ రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), విరాట్‌ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్‌ శర్మ(37), రిషబ్‌ పంత్‌(25)లు పెవిలియన్‌కు చేరారు.

టీమిండియా కోల్పోయిన ఆరు వికెట్లలో హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియాన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, స్టార్క్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.ఆసీ​స్‌ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఆసీస్ బౌల‌ర్లు దాటికి ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్ పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. 15 పరుగుల​కే ఓపెనర్లు రాహుల్‌, విజయ్‌ పెవిలియన్‌కు చేరారు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ కోహ్లి వెంటనే అవుటయ్యాడు. రహానే కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. టెస్ట్‌ స్పెషలిస్ట్‌ పుజారా, రోహిత్‌తో కలిసి కాసేపు పోరాడాడు. ఈ జోడిని లియాన్‌ విడదీశాడు. కుదురుకుంటున్న రోహిత్‌ను పెవిలియన్‌ను పంపాడు. ఆపై కాసేపటికి రిషబ్‌ పంత్‌ను కూడా లియాన్‌ ఔట్‌ చేసి భారత్‌కు మరో షాకిచ్చాడు.మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 9 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది .ప్ర‌స్తుతం పూజారా,ష‌మీ క్రీజులో ఉన్నారు.