Friday, March 29, 2024
- Advertisement -

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన‌ వెండీస్ స్టార్ ఆట‌గాడు..

- Advertisement -

వెస్టిండీస్ విధ్వంస‌క‌ర ఆట‌గాడు క్రిస్ గేల్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌క‌ప్‌లో విండీస్ త‌రుపున ఆడుతున్నారు. ఆగస్టులో టీమిండియాతో జరిగే టెస్ట్ సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. వెస్టిండీస్ ఆగస్టులో టీమిండియాతో మూడు టీ-20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని గేల్ ఇంతకు ముందే ప్రకటించారు. అయితే త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న గేల్ ఇండియాతో సిరీస్ తర్వాత తప్పుకుంటానని తాజాగా వెల్లడించాడు. దానికి కూడా ప్ర‌ధాన కార‌ణం ఉంది.

1999లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన గేల్… టీమిండియాతోనే చివరి మ్యాచ్ ఆడబోతుండటం గమనార్హం. వెస్టిండీస్ తరపును 103 టెస్టులు, 295 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్ లను గేల్ ఆడాడు. టెస్టుల్లో 7,214 పరుగులు, వన్డేల్లో 10,345 రన్స్, టీ20ల్లో 1,627 పరుగులు సాధించాడు. ఆగస్ట్ లో విండీస్ తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -