Thursday, April 25, 2024
- Advertisement -

అత‌ను నన్ను ఘోరంగా అవ‌మానించాడు – మిథాలీ రాజ్

- Advertisement -

మిథాలీ రాజ్ మ‌హిళ ప్ర‌పంచ క్రికెట్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకుంది.మ‌హిళ క్రికెట్‌లో 5000 ప‌రుగులు పూర్తి చేసిన క్రికెట‌ర్‌గా గుర్తింపు పొందింది.ఇలాంటి క్రికెటర్‌కు ట్వంటీ20 మహిళా ప్రపంచ కప్ టోర్నమెంట్ సెమీఫైన‌ల్లో చోటు ద‌క్క‌లేదు.పైగా సెమీఫైన‌ల్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఘోరంగా ఓడిపోయింది.అయితే త‌న‌కు జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవడంపై హిళా క్రికెట్ జట్టు కోచ్ రమేష్ పొవార్‌పై బిసీసీఐకి ఫిర్యాదు చేసింది మిథాలీ రాజ్.తన పట్ల రమేష్ పొవార్ పక్షపాతం, వివక్ష ప్రదర్శించారని ఆమె విమర్శించారు. ఇంగ్లాండుతో జరిగిన కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచుకు ఎంపిక చేసిన తుది జట్టులో మిథాలీ రాజ్ కు చోటు కల్పించలేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచును భారత జట్టు ఓడిపోయింది. ఇంగ్లాండుతో జరిగిన కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచుకు ఎంపిక చేసిన తుది జట్టులో మిథాలీ రాజ్ కు చోటు కల్పించలేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ మ్యాచును భారత జట్టు ఓడిపోయింది. ఆ విషయంపై వివాదం చెలరేగడంతో జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ సోమవారంనాడు సీసీఐ అధికారులను కలిశారు. ట్వంటీ20 మహిళా ప్రపంచ కప్ క్రికెట్ సిరీస్ లో మిథాలీ రాజ్ రెండు మ్యాచుల్లో అర్థ సెంచరీలు చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచుగా కూడా రెండు సార్లు ఎంపికయ్యారు. మిథాలీ రాజ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడం పట్ల విచారమేమీ లేదని ఇంగ్లాండుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో ఓటమి తర్వాత కెప్టెన్ కౌర్ అన్నారు. దానిపై మిథాలీ రాజ్ మేనేజర్ తీవ్రంగా ధ్వజమెత్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -