Tuesday, April 16, 2024
- Advertisement -

ప్రియురాలితో పెల్లిపీట‌లెక్క‌బోతున్న క్రికెట‌ర్ …

- Advertisement -

టీమిండియా యువ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల గర్ల్ ఫ్రెండ్ చారూను డిసెంబర్ లో వివాహం చేసుకోబోతున్నట్టు వెల్లడించాడు. తన ప్రేమ కథను చెబుతూ, 2013లో ఆగస్టు 22వ తేదీన తొలిసారిగా ఆమెకు హాయ్ చెప్పానని గుర్తు చేసుకున్నాడు.

అమెతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేయడానికి ఐదేళ్లు సమయం పట్టింది. ఈ స్పెషల్ గర్ల్‌తో ప్రేమలో పడ్డానని ప్రపంచానికి తెలియజేస్తున్నా. ఒకరికొకరం సమయాన్ని వెచ్చించాం. కానీ చెట్టాపట్టాలేసుకుని మాత్రం తిరగలేదు. నేడు తమ పెళ్లికి తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, చారూ కుటుంబంతో మాట్లాడి పెళ్లిని ఫిక్స్ చేసినందుకు కృతజ్ఞతలని అన్నాడు. డిసెంబర్ 22న తమ పెళ్లి జరుగుతుందని, చారూ తండ్రి తిరువనంతపురంలో సీనియర్ జర్నలిస్టని వెల్లడించాడు.

వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శాంసన్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. టీమిండియాకు కేవలం ట్వంటీ 20 ఫార్మాట్లో ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్.. జాతీయ జట్టులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్ లో రాణించిన శాంసన్.. జట్టులోకి పిలుపు వస్తుందని భావించినా నిరాశే ఎదురైంది. దాంతోపాటుగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎంఎస్ ధోని కొనసాగుతుండటంతో కీపర్ బ్యాట్స్‌మెన్లకు అంతగా అవకాశాలు రావడం లేదన్నది వాస్తవం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -