Wednesday, April 17, 2024
- Advertisement -

ధోని బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై స్పందించిన బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగర్..

- Advertisement -

ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ధోని బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపైనే ఇప్పుడు టీమిండియాలో రోహిత్ , కోహ్లీ మధ్య విబేధాలు బయటప పడ్డాయి. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 240 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ (1), కేఎల్ రాహుల్ (1), విరాట్ కోహ్లీ (1) రూపంలో వరుసగా వికెట్లు చేజార్చుకుంది. దీంతో.. ఐదో స్థానంలో ధోనీ బ్యాటింగ్‌కి వస్తాడని అంతా ఊహించారు. కాని వరుసగా పంత్, దినేష్ కార్తిక్ ను పంపింది.

ధోనీని బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి పంపడం ‘బ్యాటింగ్ కోచ్’ తెలివి తక్కువ నిర్ణయమని అంతా విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. అతనిపై వేటు వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్‌లు వినిపించాయి. బీసీసీఐ కూడా సంజయ్ భంగర్ పై వేటు వేసేందుకు సిద్దమయ్యింది. ఇలాంటి సమయంలో భంగర్ స్పందించారు.

వరల్డ్‌కప్‌లో కివీస్‌తో జరిగిన నాకౌట్‌ పోరులో ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిన నిర్ణయం తన ఒక్కడిదే కాదంటూ పేర్కొన్నాడు. అది సమిష్టిగా అందరు కలసి నిర్ణయం తీసుకున్నామన్నారు. మిడిల్‌ ఆర్డర్‌లో ఐదు, ఆరు, ఏడు స్థానాలపై చర్చించిన తర్వాత దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యాల తర్వాత ధోనిని బ్యాటింగ్‌కు పంపామన్నాురు. అందరూ నన్నే టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -