కోహ్లీ భావోద్వేగం….విరాట్ చేతిని ముద్దాడిన అనుష్కశర్మ…

145
Delhi : Virat Kohli Crying Anushka Sharma Kiss On His Hand
Delhi : Virat Kohli Crying Anushka Sharma Kiss On His Hand

మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ జంట.తనభర్త కోహ్లీ కి సంతోషంలోను…..బాధలోను ఎప్పుడూ ఆయన వెంటే ఉంటుంది.స్టేడియంలో సెంచరీ, హాఫ్ సెంచరీ, సిక్సులు ఇలా ప్రత్యేక సందర్భాల్లో అనుష్కకు కోహ్లీ గాల్లో ముద్దులు విసరడం చాలాసార్లు చూశాం. అలాంటి సంఘటనే ఇప్పుడు చోటు చేసుకుంది.

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంని.. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మైదానంగా మార్చారు.ఈ సందర్భంగా గురువారం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ వచ్చారు.

అంతేకాక ఓ స్టాండ్‌కి విరాట్ కోహ్లీ పేరుని పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆ సంద‌ర్భంలో విరాట్ ప‌క్క‌న కూర్చున్న అనుష్క అత‌ని చేతిని ముద్దాడి చాలా ఎమోష‌న‌ల్ అయింది. ఆ స‌మ‌యంలో విరాట్ కూడా భావోద్వేగానికి గురై అనుష్క చేతిని గట్టిగా ప‌ట్టుకున్నాడు. ఈ స‌న్నివేశం కెమెరాల‌లో రికార్డ్ కాగా, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

క్యూట్ కపుల్, అన్ కండిషనల్ లవ్, బెస్ట్ జోడీ, విరూష్కా జోడీ అద్భుతం అని కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు ఇక్కడ కూడా వీళ్లు ఇలానే ప్రవర్తిస్తారా, మీరు మారరా అంటూ ట్రోల్స్ విసిరేవాళ్లు ఉన్నారు.

Loading...