టీమిండియాలోకి ధోనీ మళ్లీ ఎంట్రీ ఇవ్వాలంటే ఇదొక్కటే మార్గమట..!

749
dhoni Has Left The Door Open For A Comeback Says Dean Jones
dhoni Has Left The Door Open For A Comeback Says Dean Jones

టీమిండియాలోకి మహేంద్రసింగ్ ధోనీ రీఎంట్రీకి తలుపు తెరిచే ఉన్నాయని ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ అభిప్రాయపడ్డారు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత భారత్ తరుపున ధోనీ మ్యాచ్ ఆడలేదు. దాంతో.. టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి ధోనీ పేరుని బీసీసీఐ తప్పించగా.. ఇక అతని కెరీర్ ముగిసినట్లేనని వార్తలు కూడా వచ్చాయి. ధోనీ మాత్రం మౌనంగా ఉన్నారు.

నిజానికి గత ఏడాది చివర్లో వెస్టిండీస్ తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌తో భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ధోనీ ఆశించాడు. కానీ జట్టులోకి అతను ఎంపికవలేదు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ధోనీ రాణిస్తే.. అతనికి జట్టులో అవకాశం ఇచ్చేందుకు తమకేమీ అభ్యంతరం లేదని చెప్పాడు. అయితే మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. కానీ ఇటీవల టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడటంతో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ని యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్‌‌కి మార్గం సుగమం కావడంతో ధోనీ రీఎంట్రీపై ఆశలు చిగురించాయి.

ఈ నేపథ్యంలో ధోనీ రీఎంట్రీపై డీన్ మాట్లాడుతూ.. “ఇప్పుడు భారత సెలక్టర్లు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్‌ని ఎంపిక చేయాలని ఆశిస్తున్నారు. కానీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ధోనీ మెరుగ్గా రాణించగలిగితే..? అప్పుడు అతని రీఎంట్రీకి దారులు తెరుచుకుంటాయి. అయితే.. పొరపాటున ఐపీఎల్‌లో ధోనీ ఫెయిలైతే ఇక అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లే. మొత్తగా ఒక్కటి మాత్రం చెప్పగలను. ధోనీకి ఐపీఎల్ రూపంలో టీమిండియాలోకి రీఎంట్రీ కోసం తలుపు తెరిచే ఉంది. కరోనా వైరస్ కారణంగా లభించిన బ్రేక్ కూడా అతనికి బాగా ఉపయోగపడనుంది” అని చెప్పుకొచ్చారు.

కోహ్లీ భయం అంటే ఏంటో తెలియదట : లాయిడ్

రోహిత్‌ ఈజీగా డబుల్ సెంచరీ చేయడానికి కారణం ఇదే..!

రోహిత్ శర్మని ఔట్ చేయడం నా కల : పాక్ ఫేసర్

ఐపీఎల్ 2020 తర్వాత రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన హర్భజన్..!

Loading...