Thursday, April 25, 2024
- Advertisement -

ధోని ఉన్నంత కాలం నాకు అవ‌కాశాలు రావు – దినేశ్ కార్తిక్‌

- Advertisement -

దినేశ్ కార్తిక్ టీం ఇండియా వికెట్ కీప‌ర్ అని అంద‌రికి తెలిసిన విష‌య‌మే. దినేశ్‌ కార్తిక్‌లో చాలా టాలెంట్ దాగి ఉంద‌ని చాలాసార్లు నిరుపిత‌మైంది. త‌న‌లోకి బ్యాటింగ్ సిల్క్స్‌ని చాలాసార్లు బ‌య‌ట‌పెట్టాడు కూడా. అఖ‌రి ఓవ‌ర్‌లో 21 ప‌రుగులు సాధించి జ‌ట్టుకు విజయాన్నిందించాడు. 2019 ఇంగ్లాండ్‌లో జ‌రిగే ప్ర‌పంచ క‌ప్‌లో దినేశ్‌ కార్తిక్ కూడా చోటు సంపాదించాడు. అయితే జ‌ట్టులో త‌న పాత్ర‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు దినేశ్ కార్తిక్‌.

జ‌ట్టులో ధోని ఉన్నంత కాలం త‌న పాత్ర ఫ‌స్ట్ ఎయిడ్ లాంటిదే అని చెప్పి పెను సంచ‌ల‌నం రేపాడు.భారత జట్టులో ధోనీకి బ్యాక‌ప్‌గా రెండో వికెట్ కీపర్ చాన్స్‌ను దినేశ్ కార్తిక్‌కి ఇచ్చారు. ధోనీ కీపింగ్ చేస్తున్నంత కాలం త‌న‌కు జట్టులో స్ధానం దొర‌కడం క‌ష్టం అని భావిస్తున్నాడు దినేశ్ కార్తిక్‌. ధోనీకి గాయమైనా, లేదా వరుసగా మ్యాచ్ లు గెలిచి, ప్రయోగాలు చేయాలన్న స‌మ‌యంలోనే కార్తిక్‌కి అవ‌కాశం ఇస్తారు త‌ప్ప‌, రెగ్యుల‌ర్‌గా ఆడే అవ‌కాశం దినేశ్ కార్తిక్‌కి లేద‌ని అత‌ను అభిప్రాయ‌ప‌డుతున్నాడు.

తాను 4వ నంబర్ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు కూడా అర్హుడినేనని, ఆ అర్హతతోనైనా తనకు మరిన్ని అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నానని దినేశ్ అంటున్నాడు. మ‌రి దినేశ్ కార్తిక్ కొరిక ఎలా నెరవేర్చుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -