Thursday, April 25, 2024
- Advertisement -

ధోనీ క్రికెట్‌లో ఓ పెద్ద సూపర్ స్టార్ : డ్వేన్ బ్రావో

- Advertisement -

క్రికెట్‌లో టీమిండియా మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ సూపర్ స్టార్ అని వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్నారు. ఐసీపీలో చెన్నై సూపర్ కింగ్స్ కి బ్రావో సుదీర్ఘకాలంగా ఆడుతున్నాడు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై ఇప్పటి వరకూ మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ లోనే కాకుండా బయట కూడా ధోనీతో బ్రావో చాలా క్లోజ్ గా ఉంటారు.

తాజాగా ధోనీ గురించి ఆసక్తికరమైన విషయాల్ని బ్రావో వెల్లడించారు. జింబాబ్వే మాజీ ఫాస్ట్ బౌలర్ పోమ్మీ మబాంగ్వాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన డ్వేన్ ‌బ్రావో.. చెన్నై సూపర్ కింగ్స్‌ సక్సెస్‌కి కారణంగా ధోనీ, ఫ్లెమింగ్ అని వెల్లడించాడు.కెప్టెన్‌గా ధోనీ, కోచ్‌గా ప్లెమింగ్.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో మంచి సరదా వాతావరణం నెలకొల్పారని చెప్పుకొచ్చిన బ్రావో.. ఐపీఎల్ సమయంలో ధోనీతో ఎవరైనా.. ఎప్పుడైనా వెళ్లి స్వేచ్ఛగా మాట్లాడొచ్చని వివరించాడు.

” ధోనీ క్రికెట్ లో ఓ పెద్ద సూపర్ స్టార్. అలానే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో కూడా. ధోనీకి వీడీయో గేమ్స్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఐపీఎల్ టైంలో అతని గది తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. టీంలోని ఎవరైనా.. ఎప్పుడైనా అతనితో వెళ్లి స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. క్రికెట్‌లో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా అందరితో సరదాగా, హుందాగా ఉంటాడని ఎవరూ ఊహించరు’’ అని డ్వేన్‌బ్రావో చెప్పుకొచ్చారు.

టికెట్ బస్సు ఎక్కి దొరికిన కోహ్లీ..!

హిట్‌మ్యాన్ పేరు ఎలా వచ్చిందో తెలిపిన రోహిత్..!

కోహ్లీ కంటే సచిన్ గొప్ప ఆటగాడు : గంభీర్

228 జెర్సీ నెంబ‌ర్‌నే హార్దిక్ పాండ్యా ఎందుకు వేసుకుండంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -