Thursday, March 28, 2024
- Advertisement -

ఆప్ఘ‌న్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసిన ఇంగ్లండ్…

- Advertisement -

ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మేన్ ప‌సికూన ఆప్ఘ‌న్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశారు. ప్రీగా ఎయిర్ షో చూపించారు. ప్ర‌ధానంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు.బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే లక్ష్యంగా కసిగా బాదాడు. వన్డేల్లో అసాధారణ స్థాయిలో ఒక ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పి సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో విండీస్ వీరుడు క్రిస్‌గేల్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరిట సంయుక్తంగా ఉన్న 16 సిక్సర్ల రికార్డును తాజాగా మోర్గాన్ బ్రేక్ చేశాడు.

కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (148: 71 బంతుల్లో 4×4, 17×6) మెరుపు శతకం బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. మోర్గాన్‌తో పాటు ఓపెనర్ జానీ బెయిర్‌‌స్టో (90: 99 బంతుల్లో 8×4, 3×6), జోరూట్ (88: 82 బంతుల్లో 5×4, 1×6), మొయిన్ అలీ (31 నాటౌట్: 9 బంతుల్లో 1×4, 4×6) మెరుపులు మెరిపించారు. ర‌షీద్ ఖాన్ ఏమాత్రం త‌న ప్ర‌తిభ‌ను చూపించ‌లేక‌పోయారు. అఫ్గానిస్థాన్ అగ్రశ్రేణి స్పిన్నర్ రషీద్ ఖాన్ వికెట్ లేకుండానే ఏకంగా 110 పరుగులు సమర్పించుకున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇదే అత్యంత చెత్త బౌలింగ్ రికార్డ్‌.  నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 398 పరుగులు సాధించింది .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -