Saturday, April 20, 2024
- Advertisement -

ప‌సికూన ఆప్ఘ‌న్ పై ఇంగ్లండ్ భారీ విక్ట‌రీ….

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో పసికూన ఆప్ఘ‌న్ ను చిత్తు చిత్తుగా ఓడించింది ఇంగ్లండ్‌. ఆ జ‌ట్టు కెప్టెన్ మోర్గాన్ సిక్స‌ర్ల‌తో ఆప్ఘ‌న్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కేశారు. అది కూడా అన‌డం త‌క్కువే అవుతుంది. ప్ర‌పంచ మేటి బౌల‌ర్ అయిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో 11 సిక్స‌ర్లు కొట్ట‌డం చూస్తె ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. అఫ్గానిస్థాన్‌తో మాంచెస్టర్ వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటిన ఇంగ్లాండ్ జట్టు 150 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో పాయంట్ల ప‌ట్టిక‌లో నెంబ‌ర్ 1 స్థానంలో కొన‌సాగుతోంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్గనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 247 పరుగులు మాత్రమే చేసింది.

ఓపెనర్ జద్రాన్ డకౌట్ కాగా, గుల్బదీన్ నయిబ్(37), రహ్మత్ షా(46), షహీదీ (76), అస్గర్ అఫ్గన్(44) క్రీజులో నిలబడి గౌరవ ప్రదమైన స్కోరు కోసం క్రీజులో నిలబడ్డారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆఫ్గనిస్తాన్ 247/8 పరుగులు చేసి విజయానికి 150 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్‌లు చెరో 3 వికెట్లు తీయగా, మార్క్ వుడ్ 2 వికెట్లు పడగొట్టాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేయగా ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ మోర్గాన్ (71 బంతుల్లో 148 పరుగులు, 4 ఫోర్లు, 17 సిక్సర్లు) అజేయ సెంచరీతో రాణించాడు. అలాగే జానీ బెయిర్‌స్టో (99 బంతుల్లో 90 పరుగులు, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), జో రూట్ (82 బంతుల్లో 88 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)లతో రాణించారు. ఇక ఆఫ్గన్ బౌలర్లలో దావ్లత్ జద్రాన్, గుల్బదీన్ నయీబ్‌లకు చెరో 3 వికెట్లు దక్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -