Friday, April 19, 2024
- Advertisement -

ఇంగ్లండు వ‌ర‌ల్డ్ క‌ప్ మెన్ ఇన్ బ్లూ’ జెర్సీపై జోకులు పేలుస్తున్న నెటిజ‌న్లు…

- Advertisement -

30నుంచి ఇంగ్లండు వేదిక‌గా ప్ర‌పంచ‌క‌ప్ మ‌హాసంగ్రామం ఆరంభంకానుంది. ఈసారి ఎలాగైనా క‌ప్ గెల‌వాల‌నె ప‌ట్టుద‌ల‌తో ఇంగ్లండు ఉంది. సొంత గ‌డ్డ కావ‌డంతో కల‌సి వ‌చ్చే అంశం. కెట్ పుట్టినిల్లయినప్పటికీ.. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఆసారి క‌ప్ గెల‌వాల‌ని క‌సిగా ఉంది.

వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ జట్టు కోసం కొత్త కిట్‌ను సిద్ధం చేసింది. 1992 నాటి జెర్సీని తలపించేలా లైట్ బ్లూ కలర్‌లో కొత్త జెర్సీని రూపొందించింది. 1992 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ చేరింది. ఈసారి సొంత గడ్డ మీద హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్న ఇంగ్లిష్ జట్టు.. తమకు కలర్ కూడా కలిసొస్తుందని భావిస్తోంది.

అయితే ఈ జెర్సీపై నెటిజ‌న్లు జోకులు పేలుస్తున్నారు.కొత్త జెర్సీని గార్బేజీ బ్యాగ్‌లతో పోలుస్తున్నారు. వరల్డ్ కప్ 1990ల్లో జరిగితే సరిగ్గా నప్పేదని ఓ నెటిజన్ బదులిచ్చాడు. మెన్ ఇన్ బ్లూ భారత్ మాత్రమే అని ఇండియన్ ఫ్యాన్స్ ఈసీబీ ట్వీట్‌కు బదులిచ్చారు. ఇది ఇంగ్లాండ్ కిట్ కంటే ఇండియా కిట్‌గా అనిపిస్తోందని ఓ నెటిజన్ పంచ్‌లేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -