Saturday, April 20, 2024
- Advertisement -

రిటైర్మెంట్ పై యూ టర్న్ తీసుకున్న అంబటి రాయుడు…

- Advertisement -

వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో తనకు స్థానం లభించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కనిపిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో సెలక్టర్లు తనని పక్కన పెట్టడంతో నిరాశ చెందిన అంబటి రాయుడు.. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు జూలై నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాయుడు తాజా వ్యాఖ్యలు చూస్తే అది నిజమే అనిపిస్తోంది.

ప్రస్తుతం టీఎన్ సీఏ లీగ్ పోటీల్లో ఆడుతున్న రాయుడు గ్రాండ్ స్లామ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, మున్ముందు టీమిండియా తరఫున టి20, వన్డేల్లో ఆడాలని భావిస్తున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు, కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ లోనూ ఆడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -