Thursday, April 25, 2024
- Advertisement -

టీమిండియాలో 360° ప్లేయర్ ఎవరంటే ?

- Advertisement -

భార‌త యువ క్రికెట‌ర్ లోకేశ్ రాహుల్‌ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడంలో రాహుల్ కు మంచి పట్టు ఉంది. ఓపెనింగ్‌తోపాటు వ‌న్‌డౌన్‌, మిడిలార్డ‌ర్‌లో అత‌ను స‌త్తాచాటుతున్నాడు. వికెట్ కీపర్ గా కూడా అదరగొడుతున్నాడు.

తాజాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేశాడు, ఇక బుధవారం జరిగిన వన్డేలో 89 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్ ఆటకు ముగ్డుడైన మాజీ క్రికెటర్ కమ్ కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ ప్ర‌శంస‌లు కురిపించాడు. సోష‌ల్ మీడియాలో అత‌ణ్ని పొగుడుతూ పోస్టు పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. ఇంత‌కీ సంజ‌య్ ట్వీట‌ర్ ఏం ట్వీటాడంటే.. ఒక్క రాహుల్ మాత్ర‌మే సంప్ర‌దాయ‌, క్లాసిక‌ల్ ఆట‌ను క‌లిపి 360 డిగ్రీల త‌ర‌హాలో క‌ళాత్మ‌కంగా ఆడ‌గలడని కొనియాడాడు.

ఈ ట్వీట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మరోవైపు లిమిటెడ్ ఓవ‌ర్ల ఫార్మాట్‌లో తన ప్లేస్ ను సుస్థిరం చేసుకున్న రాహుల్.. టెస్టుల్లోనూ చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడూ. మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ అయితే టెస్టుల్లోకి రాహుల్‌ను తీసుకోవాల‌ని సూచిస్తున్నాడు. ఇదే జోరు రాహుల్ కొనసాగిస్తే టెస్టుల్లో స్థానం దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -